CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రతి ధాన్యం గింజను టిఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Share it:






మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని రాజీవ్ గాంధీ నగర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించారు.ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్న,రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఉదేశ్యం తో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది అని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని,నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు.రైతులు ప్రభుత్వం సూచించిన లాభదాయకమైన పంటలను వేసి రైతులు లాభం పొందాలని విప్ రేగా సూచించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని అని, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతును రాజు చేయడమే లక్ష్యంగా రైతు బీమా,రైతు బంధు,సబ్సిడీ విత్తనాలు, ఎరువులు,24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు,త్రాగునీరు అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు.అడిషినల్ కలెక్టర్ కర్నాటి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,మొదటి రకం ధాన్యం కు రూ.1960 రూపాయలు,రెండవ రకం ధాన్యం కు 1940 రూపాయలు ప్రభుత్వం ధర నిర్ణయిచిందన్నారు.ఇప్పటికి జిల్లా లో 154 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని,అవసరం ఐతే ఇంకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని,రైతులు ఎవరు అధైర్యపడవద్దు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,భుర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం.ముత్యాలమ్మ, డైరెక్టర్ సకిని బాబురావు,ఏ డి ఏ తాతారావు,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,పార్టీ నాయకులు, మహిళ కార్యకర్తలు,యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: