CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

5వ షెడ్యూల్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3 పై ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆదివాసీ నాయకుల డిమాండ్...

Share it:

 



  •  ఏజెన్సీ ప్రాంతంలో నూరు శాతం విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఆదివాసీలకే కల్పించాలి..
  •  రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఆదివాసి ఓట్లతో తగిన మూల్యం చెల్లిస్తాం..
  •  ఏజెన్సీ ప్రాంతంలోని మండల కేంద్రాలలో ఆదివాసి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ప్రభుత్వ భూమిని కేటాయించాలి..

  • ఆదివాసీల హక్కులు, చట్టాల గురించి గ్రామాలలో ప్రభుత్వమే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి ..


మన్యం టీవీ :  జూలూరుపాడు, నవంబర్ 9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో మంగళవారం ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక కొమరం భీమ్ పౌండేషన్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆదివాసీ సంఘాల సీనియర్ నాయకులు బచ్చల లక్ష్మయ్య, తెల్లం నరసింహారావు దొర పాల్గొని మాట్లాడుతూ.. 5వ షెడ్యూల్ ప్రాంతంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను నూరు శాతం ఆదివాసీలకే కేటాయించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3 పై ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా చట్టం తీసుకురావాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఆదివాసీ గిరిజన ఓట్లు వేయకుండా గ్రామాలలో, మండల కేంద్రాలలో ప్రచారం చేస్తామని, ప్రత్యేక కార్యాచరణను ప్రకటిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల కన్నా అత్యంత వెనుకబడిన తెగలు ఆదివాసి తెగలని అన్నారు. కాబట్టి ప్రతి ఆదివాసి కుటుంబానికి 10 లక్షల రూపాయలను కేటాయించి గిరిజన బంధు పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 5వ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతరుల వలసల వలన ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలకు దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసి ప్రాంతంలో గిరిజనేతరులు ఆదివాసీలను రాజకీయంగా వాడుకొని, ఆదివాసీలకు దక్కాల్సిన రాజకీయ పదవులు, వ్యాపారాలు పొందుతున్నారని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని అన్నారు. కింది నుండి పై స్థాయి ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు గిరిజనేతరుల మాటలకే విలువనిస్తూ అన్ని రంగాలలో ఆదివాసీలను అనగ తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఉన్నతాధికారులు స్పందించి సమత జడ్జిమెంట్ మరియు 1/70 యాక్ట్ ప్రకారం 5వ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతరులకు ఎలాంటి హక్కులు కల్పించ వద్దని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి జిల్లాలు, మండలాలు విభజన పేరుతో ఆదివాసీలను విచ్ఛిన్నం చేస్తున్నారని అన్నారు. నేడు ఆర్ ఓ ఎఫ్ ఆర్ చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులకు పోడు భూమి పట్టాలు ఇవ్వాలని చూస్తున్నారని, ఇలా జరిగితే ఆదివాసి సమాజం మొత్తం గిరిజనేతరుల చేతిలో విధ్వంసానికి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలపై ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు పెట్టకుండా పోడు వ్యవసాయం చేసే ప్రతి ఆదివాసి కుటుంబానికి పోడు భూమి పట్టా ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి మండల కేంద్రంలో ఆదివాసి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ప్రభుత్వ భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోనీ ప్రతి ఆదివాసి గ్రామంలో ఆదివాసి హక్కులు, చట్టాల గురించి అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వమే నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెల్లం మహేష్, ముదిగొండ వాసు, మడి రవి, పూనెం బాలకృష్ణ, బచ్చల అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: