CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వాలు.

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిటమట రఘుమాట్లాడుతూ.. ఏటూరునాగారం మండల కేంద్రానికి మంజూరైన సాంఘిక సంక్షేమశాఖ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థుల జీవితాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుకుంటున్న పరిస్థితి మారుమూల ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాల్లో కళ్ళకు కట్టినట్లు,కనబడుతోందని,దళిత విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని,మండల కేంద్రంలో గురుకుల పాఠశాల మంజూరై ఏళ్లు గడుస్తున్నా కనీసం నిర్మాణానికి నోచుకోలేదని,కొంతకాలం ములుగు మండలం జాకారం లో నిర్వహణ చేపట్టి ప్రస్తుతం మంగపేట మండలంలో నిర్వహణ చేపడుతున్నారని, పాఠశాలలో నాలుగు వందల పైచిలుకు విద్యార్థులు విద్యను అభ్యసించిన వారికి ఉండటానికి వసతి సౌకర్యాలు కల్పించడంలో  ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అని, విద్యార్థులు పాఠశాలలో పాములు తేలు సంచరించడం తో బిక్కుబిక్కుమంటూ, ప్రాణాలు అరచేతిలో పట్టుకుని విద్యనభ్యసించిన పరిస్థితి ఇక్కడ నెలకొందని,దళిత విద్యార్థులపై ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ఒలకబోస్తోందని అనడానికి ఇదే నిదర్శనంగా చెప్పవచ్చు అని అన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం కూడా అందించడం లేదు అని, సమస్యలు ప్రిన్సిపాల్ సిబ్బంది దృష్టికి తీసుకు వెళ్తే విద్యార్థులను కొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థుల సౌకర్యార్థం గత పదకొండేళ్ల క్రితం ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన సోషల్ వెల్ఫేర్ శాఖకు సంబంధించిన భవనం ఒక కోటి 70 లక్షలతో నిర్మాణం చేపట్టి నిరుపయోగంగా వదిలివేశారని పలుమార్లు ఏళ్ళతరబడి దళిత ప్రజాసంఘాల నాయకులు అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లిన అధికారులు పట్టించుకోలేదని,విద్యార్థులకు న్యాయం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల మరియు  ఏటూరు నాగారం లో నిరుపయోగంగా ఉన్న భవనం పరిశీలించడం జరిగిందని, విద్యార్థులకు అన్ని సౌకర్యాలకు అనుకూలంగా ఉన్నా భవనంలోకి పాఠశాలను మార్చాలని అధికారులకు విన్నవించినా పెడచెవిన పెట్టి  అధికార పార్టీ నాయకులు ఇన్ని సంవత్సరాలు నిరుపయోగంగా ఉన్న భవనంలో కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ కేటాయించినట్లు, తెరపైకి కొత్తగా వ్యూహం తీసుకువచ్చి,దళిత విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారన్నారు అన్నారు. ఇప్పటివరకు కూడా కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు.విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఏటూరు నాగారం కేంద్రంలో సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.లేని పక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులను ప్రజా సంఘాల నాయకులను కలుపుకొని దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎండి ఖలీల్ ఖాన్, మాజీ ఎంపీటీసీ జిల్లా నాయకులు వావిలాల నరసింహారావు,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్,

మండల యూత్ అద్యక్షుడు

వసంత శ్రీనివాస్

 కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: