CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పొంతన లేని బీజేపీ నాయకుల మాటలు

Share it:

 


 ➡️కేంద్ర ప్రభుత్వం ది ఒక మాట రాష్ట్ర నాయకుల ది మరో మాట

 ➡️పొంతనలేని మాటలతో పబ్బం గడుపుకుంటున్న రాష్ట్ర బీజేపీ నాయకులు

 ➡️రైతు దీక్షలో  మాటలతో బీజేపీ నాయకుల పై విరుచుకుపడ్డ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

 గుండాల నవంబర్ 12 (మన్యం మనుగడ) పొంతన లేని  మాటలు బిజెపి నాయకులు మాట్లాడుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక మాట రాష్ట్ర నాయకుల ది మరో మాటతో పొద్దు గడుపుతున్నారని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శుక్రవారం మణుగూరు తాసిల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన రైతు దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడుతూ. పొంతనలేని మాటలతో బిజెపి నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు అని ఆయన ఘాటుగా విమర్శించారు. వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తన దారిలో తాను తాను పోతుంటే రాష్ట్ర బిజెపి నాయకులు వీరి దారిలో వీరు పోతున్నారని రైతు దీక్షలో బీజేపీ నాయకుల పై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు కేంద్రం వరిని  కొనేది లేదని తేల్చి చెప్తుంటే రాష్ట్ర బిజెపి నాయకులు వరి ధాన్యాన్ని కుంటామని అబద్ధపు మాటలు ప్రచారం చేస్తున్నారన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వరి ధాన్యాన్ని కొనే విధంగా రాష్ట్ర బిజెపి నాయకులు కేంద్రం మెడలు వంచాలి అన్నారు. ఈ దీక్షలో గుండాల, ఆళ్లపల్లి మండలాల నుండి కార్యకర్తలు తరలి వెళ్లారు. గుండాల మండల అధ్యక్షులు తేల్లం భాస్కర్, మోకాళ్ళ వీరస్వామి, గడ్డం రమేష్ , సుతారి సత్యం, ఆళ్ల పల్లి మండల నుండి సర్పంచులు కొమరం శంకర్ బాబు,  పాయం వెంకట్ నారాయణ, ఉమ్మడి మండలాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య ,  కోపరేటివ్ చైర్మన్ రామయ్య , డైరెక్టర్ ఆఫీస్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: