CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతు వ్యతిరేక చట్టాల రద్దు రైతాంగపోరాట విజయమే -సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న

Share it:

 


మన్యం టీవి, పినపాక :

మూడువ్యవసాయ నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడం రైతాంగ పోరాట  విజయమని న్యాయమైన పోరాటాలకు ఎంతటి వారైనా తల వంచక తప్పదని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న  అన్నారు . సీపీఎం అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం పినపాక  బయ్యారం క్రాస్ రోడ్డులో టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు.  రైతు వ్యతిరేక చట్టాల రద్దు కోసం ఈ సంవత్సర కాలం నుండి వీరోచితంగా పోరాడిన రైతాంగానికి జేజేలు తెలిపారు సంవత్సర కాలంగా  ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ భీష్మించుకు కూర్చున్నా, రైతాంగం అంకుటిత దీక్షతో  ఉద్యమాన్ని కొనసాగించిందని ఉద్యమ ఫలితంగానే చరిత్రలో నిలిచిపోయే విజయం లభించిందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళుతెరిచి వ్యవసాయ రంగంలోని సంక్షోభాన్ని,నష్టాలను నివారించడానికి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని కనీస మద్దతు ధరలకై చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతులు సాధించిన ఈ విజయంతో దేశ  కార్మిక కర్షక వర్గం తమ హక్కులకై పోరాటం చేయాలన్నారు. పోరాటాల ద్వారానే తమ తమ హక్కులను సాధించగలమని భారత రైతాంగం నిరూపించిందని అన్నారు. ఈ ఉద్యమంలో ఎందరి ప్రాణాలు పోయినా,లక్షలాది రైతు సోదరులు పోరాటంలో పాల్గొని చిరస్మరణీయమైన విజయం సాధించారని పేర్కొన్నారు.రైతే దేశానికి వెన్నుముఖ అని,అందరికీ అన్నంపెట్టే రైతు ఆత్మహత్య చేసుకునే దుస్థితి మన దేశంలో నిర్మూలించబడాలంటే, ప్రభుత్వాలు రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతులను ప్రోత్సహించాలన్నారు. రైతు చట్టాల రద్దుకై పోరాటంలో భాగస్వాములైన ప్రతిఒక్కరికి విప్లవాజేజేలు తెలిపారు. ఈ ఉద్యమ స్పూర్తితో మరిన్ని పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు  రైతాంగానికి విప్లవ  అభినందనలు తెలిపారు ఈ ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు నట్టి వెంకటేశ్వర్లు ,గిరిజన సంఘం జిల్లా నాయకులు ముడివి రమేష్,జోగయ్య,కబ్బాకు రమేష్, రైతు సంఘం మండల అధ్యక్షులు నట్టి శంకరయ్య,  రామయ్య, కుంజా అదెయ్యా, వ్యవసాయ కార్మిక సంఘం కురసం లక్ష్మయ్య , దాడిగెల వెంకన్న, బొగ్గం శంకర్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: