CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కార్యకర్తలకు అన్నివేళలా అండగా ఉంటా:విప్ రేగా

Share it:

 




పార్టీ గెలుపు కోసం ప్రయత్నించే వారికే గుర్తింపు ఉంటుంది


👉కొందరు ప్రబుద్ధులు పార్టీ మారాలని యోచనలో ఉన్నారు


👉ఆదేశాలు హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవు


👉పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన రేగా

👉నవంబర్ 15వ తేదీన వరంగల్ లో నిర్వహించనున్న విజయ గర్జన సభను విజయవంతం చేయండి

మన్యం టీవీ,మణుగూరు:


నవంబర్ 15వ తేదీన వరంగల్ లో నిర్వహించనున్న విజయ గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం గుట్ట మల్లారం హనుమాన్ ఫంక్షన్ హాల్ నందు పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందుగా వరుసగా తొమ్మిది సార్లు తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీఎం కేసీఆర్ కి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,నాయకుల,తరపున శుభాకాంక్షలు తెలిపారు. బహిరంగ సభకు భారీ జన సమీకరణే లక్ష్యం అని, నవంబర్ 15న వరంగల్ లో జరగనున్న విజయ గర్జన సభకు ప్రతి గ్రామం నుంచి ప్రతి కార్యకర్త తరలిరావాలని పిలుపునిచ్చారు.తెలంగాణ లో సీఎం కేసీఆర్  చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు, దేశానికె ఆదర్శంగా నిలిచారన్నారు.భారతదేశ చరిత్రలో మరెక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా రైతులందరికీ 5 లక్షల రూపాయల రైతు బీమా సౌకర్యం కల్పించి,సీఎం కేసీఆర్ గారు దేశానికె ఆదర్శంగా నిలిచారు అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు పై విస్తృత ప్రచారం చేయాల్సిన బాధ్యత టిఆర్ఎస్ పార్టీ కమిటీ సభ్యుల పై ఉందని అన్నారు.కొందరు ప్రబుద్ధులు పార్టీ  మారాలనే ఆలోచన లో ఉండడం సరికాదన్నారు.అలాంటి వారికి తగిన శాస్తి జరుగుతుందని తెలియజేశారు.విజయ గర్జన కు బయలుదేరే ముందు ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని సూచించారు.అదేవిధంగా పినపాక నియోజకవర్గం లోని టిఆర్ఎస్ పార్టీ సంబంధించి పలు  సంఘాలను అధికారికంగా ప్రకటించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసీబీ డైరెక్టర్ తుళ్లూరి.బ్రహ్మయ్య, జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, పినపాక ఎంపీపీ గుమ్మడి. గాంధీ,ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్. భద్రయ్య,భుర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం. ముత్యాలమ్మ, టిఆర్ఎస్ నాయకులు కోలేటి. భవానీ శంకర్,బి.నర్సింహారావు టిబిజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వి.ప్రభాకర్ రా వు,వట్టం.రాంబాబు,ప్రభుదాస్,పినపాక నియోజకవర్గ 7 మండలాలకు చెందిన  టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు,పార్టీ ప్రధాన కార్యదర్శులు,జడ్పీటీసీలు, ఎంపీపీ లు,వైస్ ఎంపీపీ లు,సొసైటీ చైర్మన్ లు,సొసైటీ వైస్ చైర్మన్ లు,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, ఎంపీటీసీలు,ఉప సర్పంచ్ లు, మండల కో ఆప్షన్ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, సొసైటీ డైరెక్టర్ లు,ఆత్మ కమిటీ డైరెక్టర్ లు,టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,వార్డ్ నెంబర్లు,అనుబంధ సంఘాల విభాగాల అధ్యక్షులు సోషల్ మీడియా సభ్యులు,టిఆరేస్వి నాయకులు,యువజన నాయకులు,మహిళా కార్యకర్తలు,నాయకులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: