CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోదావరి లోయ లో అమరులైన అమరులను స్మరించుకుందాం

Share it:


మన్యం వెబ్ డెస్క్:

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ

గోదావరిలో పరివాహక ప్రాంతంలో భూమికోసం తమ రక్తాన్ని చిందించిన అమరవీరుల స్ఫూర్తి తో పాసిస్టు బిజెపి ప్రభుత్వానికి, దొర గడీల కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ సహాయ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు ఇల్లందు మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు  అన్నారు ఈరోజు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ప్రారంభం సందర్భంగా కొమరారం,మాణిక్యారం, బోయితండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న అమరుల స్థూపాల పై ఎర్ర జెండాలను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల నాయకులు ఈసం భద్రన్న, కిన్నెర పగడన్న బోయితండ సర్పంచ్ సంతు, జోగ క్రిష్ణ అధ్యక్షత వహించగా వారు పాల్గొని మాట్లాడుతూ 

గోదావరిలోయ ప్రతిఘటన పోరాట రూపకర్త కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి,పోట్ల రామ నరసయ్య,బత్తుల వెంకటేశ్వరరావు,రవన్న దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి లాంటివారు అనేకమంది ఈ దేశ విముక్తి కోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజా ఉద్యమాలు నిర్వహించారని వారు అన్నారు. విప్లవకారుల నాయకత్వం లో ఏ ప్రభుత్వాలు ఇప్పటివరకు మంచి పెట్టలేని లక్షలాది ఎకరాల భూమిని ప్రజలకు పంచిన చరిత్ర విప్లవకారులకు ఉంది అని వారన్నారు ఈ క్రమంలో అనేక మంది నాయకులను విప్లవోద్యమం లో కోల్పోవడం జరిగిందని అనేకమంది కామ్రేడ్స్ ని పోలీసుల బూటకపు ఎన్ కౌంటర్ల తో, మాఫియా ముఠాల చేత ,అనారోగ్యంతో అనేక మంది నాయకులు కార్యకర్తలు మరణించడం జరిగింది అని వారన్నారు ఇల్లందు ప్రాంతంలో కామ్రేడ్ ఎల్లన్న,కోటన్న, పగడాల వెంకన్న బొర్ర  వీర స్వామి,కుమార్,వర్స సూరన్న, కాంపాటి చంద్రం, పులుసు వెంకన్న, చిర్ర వెంకన్న, ఏనుగుల వెంకన్న, బానోత్ వెంకట్రామ్ ,చుంచు వెంకన్న ఇంకా అనేక మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు అని వారి ఆశయ సాధన కోసం పీడిత ప్రజలు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల నాయకులు మోకాళ్ళ క్రిష్ణ, బానోత్ రాంబాబు, నూనావత్ తులిస్యా, ముడిగ బుచ్చిరాములు, రాంబాబు, గుగులోత్ లచ్చిరాం, బోడ గన్ను, రవి,పాప, మూడు మాలు, జోగ క్రిష్ణ, సర్పంచ్ క్రిష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: