CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరులకు అటవీ పై హక్కు కల్పించవద్దు.

Share it:


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో బుధవారం తుడుందెబ్బ మండల అధ్యక్షులు గుండ్ల పాపారావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు ఆలం కిషోర్ హాజరై మాట్లాడుతూ.భారత రాజ్యాంగం ఆదివాసీలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐదో షెడ్యూల్ భూభాగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం గిరిజనే తరులకు హక్కులు కల్పిస్తామనడం అత్యంత శోచినియంగా ఉందనిఅన్నారు.భారతదేశంలో మినీ రాజ్యంగా ప్రకటించబడిన 5,6వ షెడ్యూల్ లో గిరిజనేతరులకు ఎటువంటి హక్కులు లేవని అయినా ఈ ప్రభుత్వాలు కుట్రపూరితంగా వారికి హక్కులు కల్పించాలని చూస్తుందని అన్నారు. షెడ్యూల్ ఏరియానీ ప్రీజో న్ గా ప్రకటించేందుకు కేంద్ర,రాష్ర్ట ప్రభత్వాలు కుట్రలు పన్నుతున్నాయని దీనిని ఆదివాసీలు తిప్పి కోటలని అన్నారు.ఇప్పటికే 1/70చట్టం వడ్డీ వ్యాపారం నిషేధిత చట్టం1962 లాంటి ఎన్నో కేంద్ర చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని అన్నారు.ఆదివాసీలు తమ హక్కులు,చట్టాల కోసం పోరాటాలకు సిద్దం కావలని అన్నారు.5వ షెడ్యూల్ భూ భాగం రక్షణ పోరాటాలకు సిద్దం గా ఉండాలని, పిలుపునిచ్చారు.పొడు భూముల హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ నెల 8తారీకు  వరకు ద ఖాస్తుల గడువు పెంచాలని డిమాండ్ చేశారు.ఈ కార్య క్రమంలో తుడందెబ్బ మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షుల ఆలం నగేష్, పిరీల సురేష్, ఆలం చిరంజీవి, కోరగట్ల నగేష్,దబ్బగట్ల సాయి,వాసం మధు,ఆలం రాంబాబు,రఘుపతి, చిరంజీవి,ఆలం జంపయ్య, గుంట్టీ రాజు,మడప వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: