CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి--:ములుగు ఎమ్మెల్యే సీతక్క. .

Share it:




మన్యం టీవీ ఏటూరు నాగారం

కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వo ల నమోదు విజయవంతం చేయాలి అని అఖిల భారత కాంగ్రెస్ మహిళా జాతీయ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క  అన్నారు.డిజిటల్ సభ్యత్వ నమోదు చేయించడానికి సమన్వయ కమిటీలను నియమించారు. మంగళవారం తాడ్వాయి మండల కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ. ములుగు నియోజకవర్గంలో 302 పోలింగ్ భూతులు ఉన్నాయని,మండల అధ్యక్షులు చొరవ తీసుకుని బూత్ కమిటీలు వేయాలని,  ప్రతి భూతుకు ఒక కన్వీనర్, ఒక సోషల్ మీడియా ఇంఛార్జి మరియు ఒక ఆపరేటరును ఎంపిక చేయాలి అని,ఎంపిక చేసిన జాబితా ఈ నెల 20 వరకు నాకు పంపించాలని అన్నారు. అలాగే ప్రతి భూతు నందు 100 మందికి తగ్గకుండా సభ్యత్వాలు నమోదు చేయించాలని అన్నారు.  కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రమాద భీమా 2 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ సభ్యునికి వర్తింపజేస్తుంది అని అన్నారు.కావున మండల అధ్యక్షులు వెంటనే చొరవ తీసుకుని,బూత్ కమిటీలు వేసి,సభ్యత్వ నమోదు చేయించాలని కోరారు.  ఎన్నుకోబడిన కమిటీ సభ్యులు మండలంలోని భూతులన్నింటిని పర్యవేక్షిస్తూ బూత్ ల వారిగా సభ్యత్వ నమోదు చేయించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,మండలం ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి,మండల కన్వినర్ అనంత రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ముజాపర్,మండల మాజీ అధ్యక్షులు బొల్లు దేవేందర్,  సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్,మంగపేట సీతక్క యువసేన అధ్యక్షులు సిద్దబత్తుల జగదీశ్,జిల్లా నాయకులు లచ్చు పటేల్, గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్,సర్పంచ్ లు  తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: