CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

"ఎవరు మీలో కోటీశ్వరులు" గేమ్ షో లో కోటి రూపాయలు గెలుపొందిన భద్రాద్రి జిల్లా వాసి బి రాజారవీంద్ర..

Share it:

 


"

మన్యం టీవీ : కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి సంఘం నాగరాజు, జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా జెమిని టీవీ ఛానల్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అతిపెద్ద గేమ్ షో  "ఎవరు మీలో కోటీశ్వరులు" లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందిన  భాస్కర్ రాజా రవీంద్ర 

కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఇంత పెద్ద మొత్తం ఇప్పటిదాకా ఏ తెలుగు ఛానల్ లోనూ ఏ కంటెస్టెంట్ కానీ, ఏ సెలబ్రిటీ గాని గెలుచుకోలేదు. మొట్ట మొదటి విజేత రాజా రవీంద్రకు కోటి రూపాయలు అందించిన ఘనత జెమినీ టీవీ ఛానల్ కు మాత్రమే దక్కుతుందని విజేత అన్నారు. అసలు ఈ రాజారవీంద్ర ఎవరు?

ఈ పేరు ఎప్పుడూ వినలేదు  కదా.. రవీంద్ర  ఎక్కడి వాడు ? అతని ప్రస్థానం ఏంటి ? తెలుసుకుందాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్ ప్రాంతానికి చెందిన విశ్రాంత గ్రామీణ వికాస బ్యాంకు ఉద్యోగి బి విఎస్ఎస్ రాజు  మరియు శేషు కుమారి దంపతుల  కుమారుడు  ఈ భాస్కర రాజా రవీంద్ర ధర్మపత్ని సింధుజ కుమారుడు దేవాన్ష్ కార్తికేయ కూతురు కృతి అన్విక ఇతను 1989 నుండి 1997  వరకు మధు విద్యాలయం వైరా నందు ప్రాథమిక  విద్యాభ్యాసం చేశారు. అనంతరం1999 నుండి 2003 వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కాలేజీ నందు  బీటెక్ పూర్తి చేయడం జరిగింది.ఈ బీటెక్ ఎంఏ ఎల్ఎల్ బి చదివిన రవీంద్ర  2012 లో  పోలీస్ శాఖలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా  మంథని సర్కిల్ ముత్తారం పిఎస్ లో  సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించారు. తదుపరి 2015 నుండి నేటి వరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో విధులు నిర్వహిస్తూ నేడు సిఐడి సైబర్క్రైమ్ నందు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మరో కోణంలో ఉద్యోగ బాధ్యతల రీత్యా పోలీస్ శాఖలో 2015 నుంచి పిస్టల్ మరియు  రైఫిల్ కాంపిటేషన్ లో తెలంగాణ పోలీసు శాఖ నుంచి వివిధ కాంపిటేషన్ లో పాల్గొనడం జరిగింది. 2016లో పుణె లో జరిగిన షూటింగ్ కాంపిటేషన్ నందు ఎయిర్ రైఫిల్ విభాగంలో  బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. 2017 లో గౌహతి లో జరిగిన షూటింగ్ కాంపిటేషన్ నందు ఎయిర్ రైఫిల్ విభాగంలో  గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. 2019 లో  తెలంగాణ పోలీస్ శాఖ నుండి ఆలిండియా పోలీస్ పిస్టల్ కాంపిటీషన్ నందు సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. అంతేకాకుండా

2018 మరియు 2019 చైనాలో జరిగిన వరల్డ్ పోలీస్ షూటింగ్ కాంపిటేషన్ లో పాల్గొనడం జరిగింది. భవిష్యత్తులో భారతదేశం తరఫున ఒలంపిక్ పోటీల్లో పాల్గొని గోల్డ్  మెడల్ సాధించి

దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనమంతా కోరుకుందాం. ఈ ఎపిసోడ్ నవంబర్ 15 సోమవారం రాత్రి 8:30 గంటలకు జెమినీ టీవీలో ప్రసారం అవుతుంది.

Share it:

TS

Post A Comment: