CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇకనైనా రైతులకు న్యాయం చేయండి అధికారంలో ఉన్నది ఎవరు? ఎవరి పైన ధర్నా? -:అశ్వారావుపేట ఎంపీటీసీ, దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి.

Share it:

 


  • ప్రభుత్వాల తీరుపై తీవ్ర ఆగ్రహం


మన్యంటీవి, అశ్వారావుపేట:అధికారంలో ఉన్న పార్టీలు రైతులకు న్యాయం చేయాల్సింది పోయి దొంగే దొంగ దొంగ అన్న చందంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, ధర్నాలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గుండాలని అశ్వారావుపేట ఎంపీటీసీ, దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిమీట్ల వరి రైతుల నడ్డి విరుస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఎన్ని మెట్రిక్ టన్నుల వరి అయినా మేము కొంటామని వారు అంటున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు వరి వేస్తే ఉరి అని అంటూ వస్తుందని, ఈ గందరగోళ పరిస్థితి ఏంటో రైతులకు అర్థంకాక ఆందోళనలో ఉన్నారని, ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇకనైనా దొంగాటలు అపి రైతులను రక్షించాలని, వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సన్న వడ్లకు రూ 150 అదనంగా ఇస్తానన్న కేసీఆర్ నేడు వరి వస్తే ఉరి తీస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల ధాన్యం కొనాల్సిన వారే రోడ్లకి ధర్నాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. చవకబారు రాజకీయాలు చేస్తూ టీఆర్ఎస్, బీజేపీ పబ్బం గడుపుతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతన్నల బతుకులతో ఆడుకుంటున్నాయని తెలిపారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ఈ రెండు ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. మోసపూరిత మాటలు మాని రైతన్నలు పండించిన ప్రతిగింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Share it:

TS

Post A Comment: