CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బిర్సా ముండా జయంతి ని 15 నుండి 22 వరకు "జన జాతీయ గౌరవ దివస్ "గా గ్రామ గ్రామాన నిర్వహించండి--:గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ.

Share it:


 

మన్యం టీవీ ఏటూరు నాగారం

బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు  బిర్సా ముండా జయంతి ని జన జాతీయ గౌరవ దివస్ గా జరుపుకోవాలని ఆదేశాల మేరకు తాడ్వాయి మండల కేంద్రం లో బీజేపీ గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు మల్కం సమ్మయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా ఆదివాసీ నాయకులు బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి  తాటి కృష్ణ,మండల అధ్యక్షుడు మల్లెల రాంబాబు హాజరై మాట్లాడుతూ..బిర్సా ముండా 15  నవంబర్ 1875 - 9 జూన్ 1900 జీవించినవాడు.ఇతను ముండా తెగకు చెందిన భారతీయ గిరిజన మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు,గిరిజన మత నాయకుడు మరియు ఆదివాసీ ప్రజా సాంస్కృతిక హక్కుల పోరాట వీరుడు.అతను బ్రిటీష్ రాజ్యంలో 19 వ శతాబ్దం చివరలో బెంగాల్ ప్రెసిడెన్సీ ( జార్ఖండ్ )లో ఉద్భవించిన గిరిజన మతపరమైన సహస్రాబ్ది ఉద్యమానికి నాయకత్వం వహించాడు.దీని ద్వారా అతను భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచాడు.క్రిస్టియన్ మిషనరీ వల్ల ప్రతికూలంగా మరీనా ముండా తెగ ప్రజలు,వారి సాంప్రదాయ గిరిజన సంస్కృతిని పునరు ద్ధరించినందుకు బిర్సా ప్రయత్నం చేశాడు.ముండా గిరిజనులు అప్పటికే క్రైస్తవ మతంలోకి మారారు.తమ సంప్రదాయ సంస్కృతి విచిన్నం జరుగుతుందని గ్రహించి చర్చి మరియు పన్నులు విధించడం మరియు మత మార్పిడులు వంటి పద్ధతులను విమర్శించాడు.అతను స్వయంగా బోధకుదుగా వారి సాంప్రదాయ గిరిజన మతానికి ప్రతినిధి అయ్యాడు.మరియు త్వరలోనే,అతను వైద్యం చేసేవాడు,అద్భుత కార్యకర్త మరియు బోధకుడు అనే ఖ్యాతిని పెంచుకున్నాడు. బిర్సా ముండా గిరిజనులకు వారి అసలు సాంప్రదాయ గిరిజన మత వ్యవస్థను అనుసరించమని సలహా ఇవ్వడం ప్రారంభించాడు.అతని బోధనలతో ముగ్ధులైన ఆదిమ తెగల ప్రజలు అతని ఆశీర్వాదాలను కోరుకున్నారు.

మా భూములపై మాకే హక్కులుండాలని,అక్రమ వలసలు వద్దని,మా స్వరాజ్యం మాదేనని బ్రిటిష్ కంపెనీలపై గెరిల్లా పోరాటాలకు జంగ్ సైరన్ చేశాడు.ఈ పోరాటంలో బ్రిటీష్ కంపెనీలకు పట్టుబడి తన అనుసరులతో జైలుపాలైనారు.కొంతకాలంగా ఉండి జైల్లోనే మరణించారు.

ఆయన మరణానంతరం ఉద్యమం మరుగున పడింది. 1908లో బ్రిటీష్ వలస ప్రభుత్వం చోటానాగ్‌పూర్ టెనెన్సీ యాక్ట్ (CNT)ని ప్రవేశపెట్టింది.ఇది గిరిజనుల భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయడాన్ని నిషేధించింది.బిర్సా పోరాటంతో భారత మొదటి స్వసంత్ర సమరం మొదలైంది.అదే పోరాట స్ఫూర్తితో భారత ప్రజలు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు.ఇంతటి మహనీయునికి బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా గుర్తింపునిచేలా చేసినందుకు గాను ఆదివాసీల గిరిజనుల పక్షాన గౌరవ ప్రధాని నరేంద్రమోదీ కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొండూరి నరేష్, అల్లె జనార్దన్,మండల ప్రధాన కార్యదర్శి మెడిశెట్టి పురుషోత్తం,మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఎండి యాకుబ్ పాషా,జిల్లా కిసాన్ మోర్చా,గిరిజన మోర్చా దళిత మోర్చా,మరియు మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శులు జాంగా హన్మంతరెడ్డి,కాక నర్సింగరావు,గద్దల రఘు, నాగులమీరా మండల ఉపాధ్యక్షులు ఆలం శ్రీను,సీనియర్ నాయకులు కోర్నిబెల్లీ సేనపతి, తాడ్వాయి,కాల్వపల్లి అధ్యక్షులు ఆళ్ల నవీన్,గడ్డమీది సురేష్ లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: