CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంగన్వాడి సెంటర్ లో చిరుధాన్యాల పండుగ..

Share it:



మన్యం టివి, దుమ్ముగూడెం:

దుమ్ముగూడెం ప్రాజెక్టు పరిధిలో గల  రెగుబల్లి అంగన్వాడి సెంటర్ లో చిరుధాన్యాల ఆహార పండుగ కార్యక్రమాన్ని నిర్వహించరూ. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తెల్లం సీతమ్మగారు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో అందరూ పాలిష్ చేసిన బియ్యం ని తింటున్నారని దానిని వదిలి చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని తినాలని దీని వల్ల ఆరోగ్యం బాగుంటుందని తెలియజేశారు. స్థానిక ఎంపీటీసీ ఎలమంచిలి వంశీ  మాట్లాడుతూ మన తాత ముత్తాతల నుండి చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకున్నారు. దీని వల్ల వారు ఎటువంటి రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. మనం కూడా రోజువారీ ఆహారంలో దీనిని భాగం చేసుకోవాలని అన్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్ట్ అధికారిని నవ్యశ్రీ  మాట్లాడుతూ రైతులు పండించే  పంటలతో పాటు చిరుధాన్యాలను అంతరపంటగా వేసి సాగు చేయాలని కోరారు. చిరుధాన్యాలలో ఐరన్, కాల్షియం, విటమిన్లు అనేక పోషకాలు కలిగి ఉంటాయని తెలిపారు. రేగు బల్లి సర్పంచ్ ,ఉప సర్పంచ్  ,స్కూల్ , పంచాయతీ సెక్రటరీ  మాట్లాడుతూ చిరుధాన్యాలతో పోషకాహార లోపాన్ని నివారించవచ్చు అని అన్నారు.  ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు చిరుధాన్యాలతో చేసిన 11 రకాల వంటకాలను ప్రదర్శనగా ఉంచి గర్భిణీలకు, బాలింతలకు, తల్లులకు, గ్రామస్తులకు పంపిణీ చేయడం జరిగింది .తర్వాత వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సీతమ్మ , స్థానిక ఎంపిటిసి యలమంచిలి వంశీ ,సి పి డి ఓ నవ్యశ్రి ,రేగుబల్లి సర్పంచ్ పూజారి మోహన్ రావు , ఉపసర్పంచ్ రామకృష్ణ , ప్రైమరీ స్కూల్ హెచ్ఎం శివ  ,పంచాయతీ సెక్రెటరీ శ్రీకాంత్  ,వార్డ్ మెంబర్లు ప్రశాంతి ,ఆదిలక్ష్మి, సూపర్వైజర్లు మాణిక్యమ్మ , కవిత ,సావిత్రి గారు, ధనలక్ష్మి , అంగన్వాడీ టీచర్లు, తల్లులు గ్రామస్తులు ,రైతులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: