CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజావేదిక లో బయటపడ్డ అవినీతి...

Share it:

 


.గుర్రాయి గూడెం పంచాయతీ కార్యదర్శి కి షోకాజ్ నోటీస్.....

.రూ.6 లక్షలు రికవరీ,44వేలు జరినామా వేసిన అధికారులు....

 చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగింది. ఆదివారం డి ఆర్ డి ఏ పిడి, ప్రాసెస్ ఇన్ అధికారి సుబ్రహ్మణ్యం, జిల్లా విజిలెన్స్ అధికారి రమణ రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గత వారం రోజులుగా ఎస్ ఆర్ పి కొండలురావు ఆధ్వర్యంలో 14 పంచాయితీల్లో చేపట్టిన సోషల్ ఆడిట్ బృందం సామాజిక తనిఖీ లలో ఉపాధి హామీ పథకం లో చోటుచేసుకున్న అవినీతిని 13 విడత ప్రజా వేదిక లో బయట పడింది. చండ్రుగొండ లోని రైతు వేదిక భవనం లో జరిగిన ప్రజా వేదిక శనివారం అర్ధరాత్రి వరకు జరిగింది.. ప్రధానంగా 4685 పనులు మండలంలో 2018 నుండి 2021 వరకు రూ 11.87 కోట్లు ఖర్చు అయినాయి. వీటిలో గుర్రాయి గూడెం పంచాయతీ సెక్రెటరీ విధుల్లో అలసత్వం, రికార్డుల మెయింటెనెన్స్ చేయకపోవడం, మాస్టర్ లో ఒకరికి బదులు మరొకరు పనులు చేయించడం, అవినీతికి పాల్పడడం వంటి ప్రజా వేదిక లో తేలడంతో ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రూ.600,211లు ఉపాధి హామీ పధకం సిబ్బంది, జి పి ల సెక్రెటరీ నుంచి రికవరీకి ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పథకం సిబ్బందిపై రూ 44 వేల ఫైన్ వేశారు. 9 పనులకు క్వాలిటీ కంట్రోల్ అధికారులు తిరిగి పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు...

 ప్రజా వేదిక గా గుర్రాయి గూడెం గ్రామస్తుల ఘర్షణ.... ఉపాధి హామీ పథకం లో జరిగిన అవినీతి వెలికి తీసే క్రమంలో గుర్రాయి గూడెం గ్రామస్తులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాగ్వాదం తో పాటు. ఘర్షణ పడ్డారు.. ప్రజా వేదిక పై ఉన్న అధికారులు వారిని సముదాయించారు.. ఇదంత కి కారణం జీపీ సెక్రటరీ వైఖరి.. కారణమని అధికారులు గుర్తించి ఆమెకు షోకాజ్ నోటీసు అక్కడికి ఆదేశాలు జారీచేశారు.. దీంతో ఇరు వర్గాల శాంతించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ విజిలెన్స్ మేనేజర్ అనూష, ఎంపీపీ బానోత్ పార్వతి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, సర్పంచ్ మల్లిపెద్ది లక్ష్మీ భవాని, ఎంపీడీవో అన్నపూర్ణ, మండల పంచాయితీ అధికారి తోట తులసి రామ్,తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: