CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

యంత్రో రక్షతి రక్షితః ఇంజనీర్ దావులూరి శ్రీనివాసరావు

Share it:

 


మన్యం టీవి, మణుగూరు:

         ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుందని అదేవిధంగా యంత్రో రక్షతి రక్షితః యంత్రాన్ని నువ్వు రక్షిస్తే యంత్రం నిన్ను ప్రమాదాల బారినుంచి రక్షిస్తుందని పీకే ఓ సి సెక్షన్ 2 షావేల్స్ అండ్ డ్రిల్స్ ఇంచార్జ్ శ్రీ దావులూరి శ్రీనివాసరావు (SE,E&M) అన్నారు, పీకే ఓసి రక్షణ విభాగం ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఓసి 2 షావేల్స్ అండ్ డ్రిల్స్ సెక్షన్ లో జరిగిన సేఫ్ ఆపరేషన్ ప్రొసీజర్ (SOP) గనిలో పనిలో మదిలో రక్షణ మన బాధ్యత అనే అంశంపై వాహన డ్రైవర్లు విధి నిర్వహణలో ప్రమాదాలు జరగకుండా పాటించవలసిన రక్షణ సూత్రాలను ఎస్ ఓ పి కంఠస్థ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు, వాహన డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించాలని డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడరాదని, పరిసరాలను నిశితంగా గమనిస్తూ వాహనం నడపాలని తనతో పాటు తన వాహనంలో ప్రయాణిస్తున్న వారికి కూడా ప్రమాదాలు జరగకుండా చూడవలసిన బాధ్యత డ్రైవర్ పై ఎంతో ఉందన్నారు, పక్కన కూర్చున్న వారు కూడా అన్ని డ్రైవర్ చూసుకుంటాడు మనకెందుకులే అని నిర్లక్ష్యంగా ఉండకూడదని వారు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని ఆయన అన్నారు మోటార్ వెహికల్ డ్రైవర్ ఈ ప్రశాంత్ కుమార్ ఎస్ ఓ పి చదివించారు, అనంతరం అందరూ రక్షణ ప్రతిజ్ఞ చేశారు, ఈ కార్యక్రమంలో అధికారులు భూక్య వీరన్న, వై సుదీర్, విజయ రావు, భాస్కర్, ఫోర్ మెన్ లు రమణ ,రాజేందర్ ,నరేందర్ ,రాకేష్ , విక్రమ్, వరుణ్ , నరేష్ ,కోటేశ్వరరావు,గుర్తింపు సంఘం నాయకులు, బుద్ధ వెంకటేశ్వర్లు, భద్రయ్య, M సంజీవ రావు ఎస్ ఓ పి సమన్వయకర్త నా సర్ పాషా, సీనియర్ కార్మికులు V వెంకట రత్నం, శ్రీరాములు, శ్రీనివాస్, సుదర్శన్, రామారావు, నర్సయ్య, రామ్మోహన్, శివ కోటాచారి,A వెంకటేశ్వర్లు ఎంవీ డ్రైవర్లు శ్యామల నరేష్, ఉమామహేశ్వరరావు, ప్రైవేటు కన్వినెన్స్ వాహన డ్రైవర్లు జల్లాఅశోక్ ,రాము తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: