CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కవిత నేను నీకు అండగా ఉంటా తల్లి

Share it:

 


✍️కవిత చదువుకు రూ.10వేల ఆర్థిక సాయం అందజేసి మణుగూరు వాసి ,సామాజిక సేవకుడు నవీన్ బాబు

✍️కదిలించిన మన్యం మనుగడ సంచిక,మన్యం టీవి. కామ్ కథనం

✍️నవీన్ బాబు కి, దుమ్ముగూడెం మండల మన్యం టీవి కి కృతజ్ఞతలు తెలిపిన కల్లూరి కవిత


మన్యం టీవి, దుమ్ముగూడెం: మండలంలోని రామచంద్రపురం గ్రామం చెందిన కల్లూరి కవిత చదువుకు ఆర్థిక సాయం అందించాలని మన్యం టీవి,మన్యం మనుగడ సంచికలో కవితమ్మ చదువుకు ఆర్ధిక సహాయం కోసం ఎదురు చూపు అనే శీర్షిక ప్రచురితమైనది. ఈ కథనానికి స్పందించి మణుగూరు పట్టణానికి చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ , సామాజిక సేవకుడు నవీన్ బాబు మానవతా దృక్పథంతో స్పందించారు. శనివారం చదువుల తల్లి కవిత దగ్గరకు తన బృందంతో కలిసి వచ్చి పై చదుకు అన్ని విధాల సహాయం అందిస్తానని భరోసా నిచ్చారు. బాగా చదువు కోవాలని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనకు కాల్ చేయమని కవితకి కొండంత ధైర్యం ఇచ్చారు.ఈ సందర్భంగా నవీన్ బాబు రూ.10 ఆర్థిక సాయం తో పాటు నూతన వస్త్రాలు అందించి మానవత్వం చాటుకున్నారు.కవిత మాట్లాడుతూ తనకు అన్ని విధాలా సహాయం చేస్తాను అన్ని చెపిన్న నవీన్ అన్న కు కృతజ్ఞతలు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో నవీన్ బాబు బృందం పాల్గొన్నారు.

Share it:

Post A Comment: