CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎస్ఎఫ్ఐ-ఐద్వా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Share it:

 


మన్యం టీవి(కొత్తగూడెం టౌన్),

✍️సంఘం నాగరాజు,కొత్తగూడెం మన్యం టీవి ప్రతినిధి:

 తెలంగాణ సాంప్రదాయాన్ని కాపాడుకుందాం : సులోచన రాణి, ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్


 మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి: మందలపు జ్యోతి, ఐద్వా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి 


 *కొత్తగూడెం టౌన్,ప్రభుత్వ జూనియర్ కళాశాల:

స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ సులోచన రాణి మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయం బతుకమ్మను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.బతుకమ్మ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అమ్మాయిలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి సమాజం తోడ్పాటు అవసరం అన్నారు.


 *మహిళలపై దాడులను అరికట్టండి:* మందలపు జ్యోతి 


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అమ్మాయిలపై జరుగుతున్న దాడులను అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హైదరాబాదులో చిన్నారిపై జరిగిన దాడి హేయమైన చర్య అనీ ఇటువంటి దాడులు పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో స్త్రీ పట్ల మానవ సమాజ దృక్పథం మారాలి అన్నారు. స్త్రీకి భద్రత కల్పిస్తూ లింగ వివక్షత పట్ల కళాశాలల్లో చైతన్యపరిచేందుకై అవగాహన సదస్సులు,సెమినార్ లు నిర్వహించాల్సిన బాధ్యత ఉందన్నారు.


 *బతుకమ్మ స్ఫూర్తితో అమ్మాయిలపై జరుగుతున్న దాడులు ఆపాలి*:బి వీరభద్రం ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి


అమ్మాయిలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయనీ,ఇంట్లో, కళాశాలల్లో విద్యార్థినిలకు రక్షణ కరువైందని,మహిళల హక్కులు కాలరాయబడుతున్నాయని ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వీరభద్రం అన్నారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు అన్నవరపు ఇందిర, అన్నవరపు పద్మ,నందిపాటి రజిత ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కత్తి రమేష్, జాస్తి రమేష్ బాబు,కళాశాల ఉపాధ్యాయులు బండి వెంకటేశ్వర్లు, షాహీన్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు నవీన్ కొట్టే, పవన్ కుమార్, యశ్వంత్,పవన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: