CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉదయం నుండే మహిళలతో కోలాహలంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం

Share it:

 


తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ:విప్ రేగా కాంతారావు


👉మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు


*వందల సంఖ్యలో హాజరైన మహిళలు

* భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పేర్చి న మహిళలు

* అలరించిన సంస్కృతిక కార్యక్రమాలు 

* విప్, పినపాక శాసనసభ్యులు దిశానిర్దేశం తో ఘనంగా బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లు చేసిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు

మన్యం టీవి, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు .క్యాంపు కార్యాలయంలోభక్తి శ్రద్ధలతో బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం వేళలో వందలాది మంది మహిళలు బతుకమ్మ వేడుకలకు తరలిరావడంతో క్యాంపు కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మహిళలు పాటలతో ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గడిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు దిశానిర్దేశం లో అత్యంత ఘనంగా బతుకమ్మ ఉత్సవ ఏర్పాటు చేయడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది మహిళలు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: