CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు లో అంబురాన్ని అంటిన బతుకమ్మ సంబురాలు

Share it:*తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం బతుకమ్మ వేడుకలు.


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల తో అంబురాన్ని అంటిన బతుకమ్మ సంబురాలు.ఈ సందర్భంగా మండల ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉత్సహాంగా పాల్గొని, ఆటపాటలతో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ పొశం.నర్సింహారావు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర సంప్రదాయ పండుగ అని, తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర పండుగగా గుర్తించి,ఆడ బిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు అని తెలిపారు. అడబిడ్డలకు అందరూ బతుకమ్మ,దసరా పండుగ ను ఆనందంగా జరుపుకోవాలి అని తెలిపారు. ఎంపీపీ కారం.విజయకుమారి మాట్లాడుతూ ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుకుంటారు అని,ఈ తొమ్మిది రోజుల వేడుక యావత్ తెలంగాణకు ఎంతో ప్రత్యేకం అని తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై,సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి అని తెలిపారు.అయితే,తెలంగాణ ఏర్పాటు తరువాత బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది అని,ప్రతీ ఏటా ప్రభుత్వం తరఫున ఎంతో ఘనంగా ఈ వేడుకలను జరుపుతోంది అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ కె.వి.రావు, ఎంపీటీసీలు,కో అప్షన్ సభ్యులు,సర్పంచ్ లు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శులు రామిడి.రాం రెడ్డి,బొలిశెట్టి నవీన్,యువజన అధ్యక్షులు హర్ష నాయుడు,రుద్ర వెంకట్ మహిళ అధ్యక్షురాలు రమాదేవి,చంద్రకళ టిఆర్ఎస్ పార్టీ నాయకులు,మహిళ కార్యకర్తలు,యువజన నాయకులు,టిఆరేస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: