మన్యంటీవి, అశ్వారావుపేట: అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ అశ్వారావుపేట మండలంలో పలు గ్రామాల్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొని బతుకమ్మ ఆటలు ఆడారు. మండలంలో తిరుమల కుంట, మామిళ వారి గూడెం, మొద్దుల మడ, దురదపాడు, ఊట్లపల్లి, పండువారి గూడెం, మల్లాయిగూడెం, రామన్నగూడెం మొదలైన గ్రామాల్లో బతుకమ్మ వేడుకలలో పాల్గొనగా, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు, శాలువా తో సత్కరించారు. అనంతరం, మహిళల తో కలిసి బతుకమ్మ కోలాట నృత్యం చేసారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కార్యదర్శి లు, మహిళలు, యువతి యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: