CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన యువకుడికి అండగా నిలిచిన జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్

Share it:

 


మన్యం టీవి, దుమ్ముగూడెం:

దుమ్ముగూడెం మండలం మారుమూల ఏజెన్సీ గ్రామమైన లింగాపురంనకు చెందిన కాకా జోగారావు అనే యువకుడి చదువుకి ఆర్థిక సాయాన్ని అందజేసిన జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్.

ఆల్ ఇండియా లెవెల్లో 9వ ర్యాంక్,తెలంగాణ రాష్ట్రంలో రెండవ ర్యాంకు సాధించి భారతదేశంలోనే ఏకైక నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో సీటు సంపాదించిన కాకా జోగారావు కాలేజీలో చేరడానికి ఫీజు కట్టలేక ఆర్థిక సమస్యలతో జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ని ఆశ్రయించడం జరిగింది.భద్రాచలం ఏఎస్పీ కార్యాలయం సందర్శన సందర్భంగా అక్కడే ఉన్న ఎస్పీ గారిని కలిసిన జోగారావుకు తక్షణమే 20,000/-ల రూపాయలను కాలేజీ ఫీజు కట్టుకోవడానికి అందజేసారు. అంతేకాకుండా ఒక్కొక్క సంవత్సరానికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని తెలియజేసిన జోగారావు చదువు పూర్తయ్యే వరకు అన్ని ఖర్చులను అందిస్తామని తెలియజేశారు. మొదట భద్రాచలం ఏఎస్పి వినీత్.జి ఐపీఎస్ ని కలిసిన యువకుడి ప్రతిభ గురించి ఎస్పీ కి తెలియజేయడంతో స్పందించిన ఎస్పీ వెంటనే యువకుడి చదువుకు కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.క్రీడల్లోనూ,పర్వతారోహణలో అత్యంత ప్రతిభ కలిగిన జోగారావును అభినందిస్తూ భవిష్యత్తులో అంతర్జాతీయస్థాయిలో పథకాలను సాధించి భారతదేశానికి మరియు మన రాష్ట్రానికి తన పుట్టిన ఊరికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.ఈ రోజు కాలేజీలో చేరడానికి ఆఖరు తేదీ అని ఆవేదన చెందుతున్న జోగారవు ఎస్పి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ వినీత్ జి ఐపీఎస్ గారితో పాటు దుమ్ముగూడెం సిఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: