CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉దుమ్మగూడెం పోలీసుల ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజనులకు ఉచిత కంటి వైద్య శిబిరం

Share it:


👉రెండు వేల మందికి పైగా ఉచిత కంటి వైద్య శిబిరానికి హాజరైన ఏజెన్సీ ప్రాంత ప్రజలు

👉ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దుమ్మగూడెం పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 5 (మన్యం టీవీ) :- ఈరోజు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు భద్రాచలం ఏఎస్పీ వినీత్.జి ఐపీఎస్ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం సిఐ వెంకటేశ్వర్లు,ఎస్సై రవి కుమార్ మరియు పోలీసు సిబ్బంది దుమ్ముగూడెం మండలంలోని పలు ఆదివాసి గ్రామాల ప్రజలకు మరియు ఛత్తీస్ఘడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామాల గిరిజనులకు నిపుణులైన డాక్టర్ల బృందం చేత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.దుమ్ముగూడెంలోని ఐటిడిఎ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రెండు వేల మందికి పైగా ఆదివాసీ ప్రజలు పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకుని,తమ కంటి చూపును మెరుగుపరచుకోవడం కోసం చికిత్సలు చేయించుకున్నారు. కంటి చూపు సరిగా లేక బాధపడుతున్న సుమారుగా 500ల మందికి కళ్ళజోళ్ళను పంపిణీ చేశారు.కంటి చూపు సరిగా లేని 200 మందికి శస్త్ర చికిత్సలు చేయించుకోవాలని పాల్గొన్న వైద్యులు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వినీత్.జి ఐపీఎస్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అండగా ఉండేందుకు ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న ఆదివాసి గిరిజనులకు అన్నిరకాల సదుపాయాలను అందజేయడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. సోమవారం నాడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పోలీసు శాఖతో పాటు ఆదివాసి గిరిజనులకు కంటి పరీక్షలు చేసేందుకు విచ్చేసిన డాక్టర్ల బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. దుమ్ముగూడెం మండలం పరిసర ప్రాంత ప్రజలను భారీ మొత్తంలో ఒకే చోటుకు తీసుకువచ్చి వారికి కంటి పరీక్షలు చేయించడానికి ఎంతగానో కృషిచేసిన దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు,ఎస్సై రవి మరియు సిబ్బందిని,వైద్యులు రమాకాంత్,తేజస్విని,కార్తీక్,అరవింద్,ఇస్సాక్, చైతన్య మరియు డాక్టర్ మణిదీప్ లను జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను, సదుపాయాలను సమకూర్చడంలో పోలీసుశాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు.

Share it:

Post A Comment: