CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆశాల పారితోషికంలో కోత విధించడం అన్యాయం

Share it:

 


    సిఐటియు జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్


మన్యం టీవీ మంగపేట.


కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆశాలకు 7500 రూపాయల పారితోషికం ఇవ్వాల్సి ఉండగా కేవలం 1000 నుండి 2000 రూపాయలు మాత్రమే ఇవ్వడం అన్యాయమని ఈ పద్ధతిని ఏఎన్ఎం, సూపర్వైజర్లు మార్చుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి ఎండి దావూద్, రత్నం రాజేందర్ అన్నారు. స్థానిక సి ఐ టి యు కార్యాలయంలో ఆశ యూనియన్ మంగపేట మండల స్థాయి సమావేశం వీ ప్రభావతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి దావుద్ , రాజేందర్ హాజరై మాట్లాడుతూ ఆశాలు కరోన జ్వరము సర్వే చేయటం, కోవిడ్ సోకిన పేషెంట్లకు మందులు ఇవ్వటం, ఫాలో అప్ చేయడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు లాంటివి ఏలాంటి పారితోషికం లేకుండా పనిచేస్తున్నారు. ఈ పనిని గుర్తించి అదనపు పారితోషికాలు ఇవ్వాల్సింది పోయి ఉన్న పారితోషికాలను తగ్గించి ఇవ్వడం ఆశాల పొట్ట కొట్టడం ఏ ఎన్ ఎం లకు తగదని ఈ విషయంపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని పూర్తిస్థాయి పారితోషికాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళనా పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఆశా లకు పారితోషికాల పద్ధతిని రద్దుచేసి ఫిక్స్డ్ జీతం అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, హెల్త్ కార్డులూ ఇవ్వాలని, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పి ఆర్సి ప్రకారం 19 వేలు ఇవ్వాలని అన్నారు.సంబంధిత జీవో వెంటనే విడుదల చేయాలని అన్నారు. పెండింగ్లో ఉన్న సర్వే బిల్లులు వెంటనే ఇవ్వాలని సర్వేలు చేయడానికి అవసరమైన రికార్డ్స్, రిజిస్టర్, స్మార్ట్ ఫోన్లు వెంటనే పంపిణీ చేయాలని అన్నారు. ఆశల హక్కులను కాలరాస్తే ఉద్యమమే అని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు గుండెబోయిన రవి గౌడ్, మడే రవి, కనక లక్ష్మి, విజయ,శ్రావ్య, చంద్ర వాణి, వసంత, అమరావతి, రమాదేవి, దేవమ్మ, అనిత ,సంధ్య ,సుగుణ అయినా 50 మంది ఆశాలు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: