CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ గ్రామాలు మన అందరి లక్ష్యం కావాలి..సిరిపురపు స్వప్న(సర్పంచ్) జే.డీ పౌండేషన్ ఆధ్వర్యంలో "ప్లాస్టిక్ రహిత "బూర్గంపహాడ్ కి శ్రీకారం.

Share it:





గ్రామాలే దేశ అభివృద్ధికి పట్టుకొమ్మలు అని గాంధీజీ మాటలు నిజం చేస్తూ, పరిశుభ్రమైన సమాజమే లక్ష్యంగా స్వచ్ఛ భద్రాచలం,స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ బూర్గంపాడు అనే నినాదంతో కలిసికట్టుగా ప్లాస్టిక్ రహిత బూర్గంపాడు ని తీర్చిదిద్దుతామని తెలిపారు సర్పంచ్ శ్రీమతి సిరిపురపు స్వప్న, ఈ మేరకు జె.డి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో బూర్గంపాడు గ్రామపంచాయతీ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ముందుగా గాంధీజీకి చిత్ర పటం కి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జేడీ ఫౌండేషన్ భద్రాచలం బాధ్యులు శ్రీ మురళీ మోహన్ కుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత భద్రాచలం స్పూర్తితో ప్లాస్టిక్ రహిత బూర్గంపాడు లక్ష్యంగా పని చేద్దామని దానికి ప్రజలు, అధికారులు,వ్యాపారస్తులు, గ్రామ పంచాయతీ మరియు మీడియా మిత్రులు సహకరించాలని కోరారు, ఈ సందర్భంగా సర్పంచ్  శ్రీమతి స్వప్న మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత బూర్గంపాడు గా తమ గ్రామాన్ని ఎంపిక చేసి ముందుకు వచ్చిన జే.డీ పౌండేషన్ ని అభినందించారు, వార్డు మెంబర్లు, ఉపసర్పంచ్, సహకారంతో త్వరలోనే పూర్తి కార్యాచరణ తో  బూర్గం పహాడ్ ని  ప్లాస్టిక్ రహితంగా తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు, ఇదే వేదికపై గ్రామ ప్రజలు, వార్డు మెంబర్ల, ఇతర పెద్దలు ,అందరూ 6 నెలల వ్యవధిలోనే ప్లాస్టిక్ నిషేధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని అతి తక్కువ కాలంలో ప్లాస్టిక్ నిషేధించిన గ్రామంగా తీర్చిదిద్దుతామని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ మురళీ మోహన్ జె.డి ఫౌండేషన్ నుంచి వినతిపత్రాన్ని అలాగే భద్రాచలం ప్లాస్టిక్ ఫ్రీ ప్రాజెక్టు రిపోర్ట్ ని అందజేశారు ,తదుపరి శ్రీమతి స్వప్న గుడ్డ సంచులు ఆవిష్కరించి అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ నెలలు కన్నా ముందే ప్లాస్టిక్ రహిత బూర్గంపాడు సాధించాలని అందరూ కలిసికట్టుగా ప్రణాళికాబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మరియు ఎంపీడీవో వివేక్ రామ్, డివిజనల్ పంచాయతీ అధికారి పవన్ కుమార్, ఎంపీవో సునీల్ శర్మ ,పంచాయతీ కార్యదర్శి సమ్మయ్య, మాజీ సర్పంచ్ శ్రీ నాగభూషణం, జేడీ ఫౌండేషన్ సభ్యులు శ్రీ కడాలి నాగరాజు, శ్రీ అంబికా శ్రీ ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి, శ్రీ యూసఫ్ మియా, వ్యవసాయ కళాశాల విద్యార్థులు శ్రీ రేవంత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: