CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బ్లాక్ రైస్ వరి సాగుతో బహుళ ప్రయోజనాలు అభ్యుదయ రైతు కాట్రగడ్డ రవీంద్రనాథ్ కీ అభినందనలు

Share it:



 మన్యం టీవీ మంగపేట.


బ్లాక్ రైస్ వరి సాగుతో బహుళ ప్రయోజనాలు పొందవచ్చునని తన వ్యవసాయ క్షేత్రంలో ఆధునిక సేద్య పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న అభ్యుదయ రైతు కాట్రగడ్డ రవీంద్రనాథ్ అభినందనీయుడని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు ఆదివారం మండలంలోని అకినేపల్లి మల్లారంలో అభ్యుదయ రైతు రవీంద్రనాథ్ సాగుచేసిన బ్లాక్ రైస్ వ్యవసాయ క్షేత్రాన్ని స్థానిక రైతులతో కలిసి సాంబశివ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్ రైస్ వరి ధాన్యాన్ని ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ థైరాయిడ్ వంటి ప్రమాదకర జబ్బులు నుండి విముక్తి పొందవచ్చు అన్నారు హైబ్రిడ్ వరి వంగడాలకు భిన్నంగా సహజసిద్ధమైన దేశవాలి కాలాబట్టి రకం వరి వంగడాన్ని పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం హర్షణీయమన్నారు ఈ వ్యవసాయ క్షేత్రాన్ని వ్యవసాయ అధికారులు వ్యవసాయ విద్యార్థులు ఆదర్శ రైతులు తరుచు సందర్శిస్తున్నారన్నారు అభ్యుదయ రైతు రవీంద్రనాథ్ గతంలో జిల్లాలోనే తొలిసారిగా బెంగాలీ వ్యవసాయ కూలీలను వినియోగించి సరికొత్త వరి నాటు పద్ధతికి శ్రీకారం చుట్టారన్నారు అదే మాదిరిగా కూలీల అవసరం లేకుండా నేరుగా వరి వెదజల్లే పద్ధతి డ్రమ్ సీడర్ ని వినియోగించటం మరియు టిష్యూ కల్చర్ పద్ధతిలో అరటి పంటను సాగు చేసి రైతుల మన్ననలు అందుకున్నారని తెలిపారు రాబోయే రోజుల్లో రైతులంతా సేంద్రియ సేద్యం వైపు మల్లెందుకు ప్రయత్నం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అభ్యుదయ రైతు కాట్రగడ్డ రవీంద్రనాథ్ కాట్రగడ్డ ఏడుకొండలు రైతులు వైట్ల విశ్వనాథం వరదయ్య తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: