CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత దివ్యాంగుడిని మోసం చేసిన న్యాయవాదిని కొత్తగూడెం బార్ అసోసియేషన్ నుంచి తొలగించాలి - సతీష్ గుండపునేని డిమాండ్.

Share it:

 


*👉  కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేష సభ్యులకు టివిపిఎస్ వినతి. భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 4 (మన్యం టీవీ) : - విద్యుత్ ప్రమాదంలో రెండు పాదాలు కోల్పోయిన దివ్యాoగుడిపై  కనీసం మానవత్వం చూపకుండా, అతనికి కోర్టు నుంచి నష్టపరిహారం వచ్చేలా చేస్తానని మాయమాటలు చెప్పి, కేసు తీసుకుని 9 ఏళ్లు గడుస్తున్నా ఏమాత్రం చొరవ చూపకుండా,అడిగిన తనపై పోలీసుల అండతో తప్పుడు కేసు చేసి, దివ్యాంగుడిని గర్భవతి అయిన అతని భార్యను ఇబ్బందులకు గురిచేస్తున్న పాల్వంచ పట్టణానికి చెందిన  ప్రముఖ న్యాయవాది జలసూత్రం శివరాం ప్రసాద్ ను తక్షణమే బార్ అసోసియేషన్  నుంచి తొలగించాలని కోరుతూ సోమవారం తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం(టివి పిఎస్) ఆధ్వర్యంలో కొత్తగూడెం కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నీరుకొండ రాజేష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా టివిపిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు 

విజేఏసీ చైర్మన్ సతీష్ గుండపునేని మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడాల్సిన న్యాయవాదులు అధర్మానికి పాల్పడితే సమాజంలో న్యాయం ఎవరుచేస్తారని అన్నారు, లారీ  క్లీనర్ గా  పనిచేస్తూ  ప్రమాదవశాత్తు  కరెంటు తీగలు తగిలి రెండు పాదాలు కోల్పోయిన సందర్భంలో తనకు కోర్టులో కేసు వేసి రు.20 లక్షల  నష్ట పరిహారం ఇప్పిస్తానని చెప్పి రోజులు గడుస్తున్నా కేసును ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం ధోరణీ చూపుతూ ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం ఇప్పించకుండా,  అదేమిటని ప్రశ్నిస్తే తనపై తప్పుడు కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని నిరక్షరాస్యుడైన, దినస్థితుల్లో ఉన్న, దివ్యాంగుడైన  గుర్రం సుధాకర్ ను చదువుకున్న పవిత్ర న్యాయవాది వృత్తిలో ఉన్న శివరాం ప్రసాద్ మోసం చేయడం సిగ్గుమాలిన చర్యఅని, ఇలాంటి న్యాయవాదుల వల్ల మిగతా వారికి కూడా కలంకo వస్తుందని, ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఈ న్యాయవాదిని తక్షణమే బార్ అసోసియేషన్ నుండి తొలగించాలని, న్యాయవాది బాధితుడికి రు.20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని విన్నవించారు. బాధితులకు న్యాయం జరగని పక్షాన గర్భవతి అయిన భార్య తో జిల్లా కోర్టు ముందే నిరాహారదీక్ష చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ అరకాల కరుణకర్,టివిపిఎస్ సభ్యులు రామారావు,సాయిబాబా,త్రినాథ్,లాలూ పాల్గొన్నారు.

Share it:

Post A Comment: