CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మిరియాల రైతులకు మంచి రోజులు.....

Share it:


  •  మిరియాల  రైతులకు  మంచి రోజులు.....
  •  మిరియాల రైతులకు  ఎస్టి డి ఎఫ్  ప్రాజెక్ట్ అమలు
  •  జాతీయ సి టి ఎఫ్ సి కామర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి

మన్యం టీవీ మంగపేట.

ఉత్తరాంధ్రలో సుగంధ పంటగా మిరియాలు పండిస్తున్న రైతులకు వివిధ పథకాల ద్వారా అవసరమైన యంత్ర పరికరాలను సబ్సిడీపై మంజూరు చేస్తామని జాతీయ సి టి ఎఫ్ సి కమిటీ (కామర్స్) మెంబర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు ఆదివారం ఆయన పాడేరు లో స్పైసెస్ బోర్డు అధికారులతో కలిసి మిరియాలు పంట క్షేత్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక గిరిజన రైతులు మిర్యాల పంట పండిస్తున్న తమకు నిచ్చెనలు మరియు జల్లెడ కరెంటు మోటార్ యంత్రాలను సబ్సిడీపై మంజూరు చేయాలని కోరారు ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి మాట్లాడుతూ పాడేరు ప్రాంతంలో స్పైసెస్ బోర్డ్ నుండి  యస్ టి డి ఎఫ్ ప్రాజెక్ట్ ద్వారా అనేక పథకాలు త్వరలోనే అమలు చేయనున్నట్లు వెల్లడించారు మిరియాల రైతుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు వ్యవసాయ యంత్ర పరికరాలు ఇతర ఇన్ పుట్స్ మంజూరు కానున్నట్లు తెలిపారు సేంద్రియ పద్ధతుల్లో సాగవుతున్న మిరియాలకు సర్టిఫికేషన్ వ్యవస్థ త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు  మారుమూల మన్యం ప్రాంతమైన పాడేరులో స్పెసెస్ బోర్డ్ సిబ్బంది బాగా పని చేస్తున్నారని అభినందించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడేరులో స్థలం కేటాయిస్తే స్పైసెస్ బోర్డు శాశ్వత కార్యాలయ భవనాలు నిర్మించేందుకు కామర్స్ మినిస్ట్రీ నుండి నిధుల మంజూరుకి కృషి చేస్తానన్నారు అనంతరం పాడేరు ఐటీడీఏ లో గల స్పైసెస్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఎంపీల సహకారంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరిన్ని అదనపు నిధులను తీసుకువచ్చి మిరియాల రైతుల సంక్షేమానికి వెచ్చించ నున్నట్లు ఆయన తెలిపారు   అనంతరం కాఫీ బోర్డు  అధికారులను కలిసి కాఫీ పంట గురించి అడిగి తెలుసుకున్నారు స్థానిక  రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు ఈ కార్యక్రమంలో స్పైసెస్ బోర్డు ఫీల్డ్ ఆఫీసర్  బొడ్డు కళ్యాణి కార్యాలయ సిబ్బంది సాంబశివరావు రత్న  మరియు కాఫీ బోర్డు అధికారులు ఎక్స్ టెన్షన్ ఇన్స్పెక్టర్ శ్రీమతి స్రవంతి కాఫీ బోర్డు ఏ ఈ ఓ శ్రీమతి భవాని వికాస్ అగ్రి ఫౌండేషన్ ప్రతినిధులు పచ్చిపులుసు నరేష్ కాట్రగడ్డ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: