CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

షెడ్యూలు కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని అదనపు కలెక్టర్ మెమొరాండం సమర్పించిన: సీఐటీయు

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.67 కోట్ల మంది షెడ్యూల్ కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్,పెన్షన్, ఇన్స్యూరెన్స్,ఉద్యోగ భద్రత,బోనస్,సెలవులు తదితర సౌకర్యాలు కల్పించాలని,రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీ ఓ 22ను సవరంచి వెంటనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు టోకెన్ సమ్మె చేస్తున్నారు ఈసందర్భంగా ఇల్లందు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు గారికి వినతి పత్రం సమర్పించారు.సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు,మున్సిపాలిటీ, గ్రామ పంచాయితీ కార్మికులు, షాప్ ఎంప్లాయిస్,ఆసుపత్రులు, లాబ్,పెట్రోల్ బంక్ లు,ఇటుక బట్టిలు మిల్లు , ట్రాన్స్పోర్ట్,పరిశ్రమలు,సెక్యూరిటీ సిబ్బంది తదితర కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్నారు.వీరందరికీ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారనీ ససీఐటీయు ఇల్లందు ప్రాంతీయ కన్వీనర్ అబ్దుల్ నబి కార్యక్రమం అనంతరం ఆలేటి కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలోఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో ఈసం వెంకటమ్మ, తాళ్లూరి కృష్ణ, కిరణ్ కుమార్,మహమూద్,రాజేష్,శ్రీనివాస్ లు నాయకత్వం వహించారు.షెడ్యూలు కార్మికులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: