CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నేడు కామ్రేడ్ యాసా కొండలరావు సంస్మరణ సభ

Share it:

 


‌ స్థలం: యాల్లంకి గార్డెన్

మన్యం టీవి, జూలూరుపాడు:

పేదలు, వ్యవసాయ కార్మికల,రైతు, కార్మిక వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం పోరాడిన కామ్రేడ్ యాసా కొండలరావు సెప్టెంబర్ 28 రాత్రి గుండె పోటు కొండలరావు మృతి చెందడం దిగ్భ్రాంతి కి గురి చేసిందాని, కొండలన్న మృతి ప్రజా ఉద్యమాలకు, మార్క్సిస్టు పార్టీ కి తీరని లోటు అని సీపీఐ(ఎం)మండల నాయకులు మండల నాయకులు భానొత్ ధర్మ అన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ...స్వర్గీయ కామ్రేడ్ కొండలరావు జూలూరుపాడు మండలం పాపకోల్లు గ్రామంలో యాసా లాలమ్మ, నాగయ్య దంపతులకు11-8-1964 న జన్మించారు, పాపకోల్లు గ్రామం నైజాం ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధపోరాట కేంద్రం , ఆ గ్రామానికి చెందిన యాసా రామయ్య, మద్దిశేట్టి జోగయ్య, రోకటి పట్టాభిరామయ్య, రోకటి చిన్న వీరయ్య లాంటి తెలంగాణ రైతాంగ సాయుధపోరాట యోధులు ప్రభావం , గ్రామ రాజకీయ, ఆర్థిక సామాజిక పరిస్థితులు కొండలరావు ను స్కూలు దశ లోనే విద్యార్థి సంఘం (ఎస్ ఎఫ్ ఐ) లోకి ఆకర్షించింది, చిన్న తనం నుంచే మార్క్సిస్టు ఉద్యమం తో నడించాడు, టెక్నికల్ విద్యా చదివి ఉద్యోగ అవకాశాలు ఉన్న సిపిఎం లో పూర్తి కాలం కార్యకర్త గా పని చేశాడు, భారత ప్రజాతంత్ర యువజన సంఘం కొత్తగూడెం డివిజన్ అధ్యక్షుడు, రైతు సంఘం వైరా డివిజన్ అధ్యక్షుడు, జూలూరుపాడు మండల సిపిఎం కార్యదర్శి గా, డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కొత్తగూడెం జిల్లా తెలంగాణ రైతు సంఘం సహాయ కార్యదర్శి గా పనిచేస్తున్నారు, నాలుగు దశాబ్దాల పైగా ప్రజా పోరాటాల్లో భాగస్వామి కామ్రేడ్ యాసా కొండలరావు.

అనేక అవతారాలు, ఆటుపోట్లు ఎదురైనా మార్క్సిస్టు ఉద్యమం ను కాపాడుకోవడానికి శ్రమించారు, వ్యవసాయ కూలీలు కూలీ రేట్లు ఉద్యమం, రైతాంగ హక్కుల పరిరక్షణ పోడు సాగు దారుల సమస్యలు పై పోరాడిన యోధుడు కామ్రేడ్ యాసా, జూలూరుపాడు మండల కేంద్రం లో సబ్ మార్కెట్ యార్డుఏర్పాటు , పోడు సాగు దారుల కు అటివీ హక్కుల పత్రాలపై బ్యాంకు లు పంట రుణాలు కోసం ఉద్యమాలు నడిపి తన తోపాటు కుటుంబ సభ్యులను సైతం ప్రజా ఉద్యమం లో భాగస్వామ్యం చేసిన చరిత్ర కొండలరావు ది , ప్రజా ప్రతినిధి గా గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన ధన్యజీవి కామ్రేడ్ యాసా, యాసా కొండలరావు 57 సంవత్సరాల వయస్సు లో మరణం మరింత బాధకు గురి చేసింది, కొండలరావు స్మారక స్థూప ఆవిష్కరణ మరియు సంస్మరణ సభ నేడు(సోమవారం:) ఉదయం 10 గంటలకు జూలూరుపాడు మండల కేంద్రం లో జరుగుతుందని, సభలో పాల్గొని కామ్రేడ్ యాసా కొండలరావు కి ఘన నివాళులు అర్పించాలి,2008 సంవత్సరం లో పార్లమెంటు, శాసన సభ పునర్వ్యవస్థీకరణ లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నాలుగు ముక్కలు గా వచ్చి కలిసిన జిల్లా లో నూతనంగా ఏర్పడిన వైరా నియోజకవర్గం లో ఉద్యమ సహచారులం గా సిపిఎం ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమాలు నడిపి వైరా నియోజకవర్గం లో సిపిఎం కు ప్రత్యెక గుర్తింపు పొందింది, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల లో రాష్ట్రం లో ఎక్కువ ఓట్లు వచ్చిన నియోజకవర్గం వైరా , అందులో కొండాన్న కృషి ఉంది మార్క్సిజం వెలుగు లో కార్మిక, కష్టజీవుల రాజ్యం కోసం కామ్రేడ్ యాసా కొండలరావు జీవిత కాలం పనిచేశారు కామ్రేడ్ యాసా ఆశయాలు సాధన కోసం పిడికిలి బిగించి ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు గార్లపాటి వెంకటి భానోత్ మధు పి. వెంకటేశ్వర యాసా నరేష్ పవన్ అభి మిత్ర ఊడల వెంకటేశ్వర్లు సురేష్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: