CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జేడీ పౌండేషన్" ఆధ్వర్యంలో గోదావరి నది బ్రిడ్జి పై ప్రమాద సూచిక బోర్డు ఏర్పాటు.

Share it:

 





 దెబ్బతిన్న రైలింగ్ ను రిపేర్ చేయాలని కోరుతూ "నేషనల్ హైవేస్ ఆధారిటీ"డి. ఈ" కి వినతిపత్రం సమర్పణ.


గత కొద్ది రోజుల క్రితం భద్రాచలం నది మీద పాత బ్రిడ్జి పైగుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో సారపాక వైపు నుండి భద్రాచలం వెళ్లే వైపు రైలింగ్ దెబ్బతిని గోడ ధ్వంసమైంది. కానీ ఇప్పటి వరకు దాని పునర్నిర్మాణం జరగలేదు, దీనివల్ల వాహన దారులకు రాత్రి పూట ప్రమాదకరంగా నూ ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు చాలా ప్రమాదం పొంచి ఉండడంతో, సామాజిక బాధ్యతగా జే.డీ ఫౌండేషన్ ఈరోజు దెబ్బతిన్న రైలింగ్ వద్ద ప్రమాద సూచిక బోర్డు ఏర్పాటు చేశారు, అలాగే నేషనల్ హైవేస్ అథారిటీ డీఈ శ్రీమతి శైలజ గారికి వినతిపత్రాన్ని చరవాణి ద్వారాఅందిస్తూ త్వరితగతిన రైలింగ్ రిపేర్ చేయాలని అలాగే కొత్త బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడానికి సమయం పట్టేటట్టు ఉన్నoదున పాత బ్రిడ్జి(RLA) రిమైనింగ్ లైఫ్ ఎసెస్మెంట్ మరియు structural stability సర్వే చేయించాలని జేడీ ఫౌండేషన్ భద్రాచలం కన్వీనర్ శ్రీ కె. మురళి మోహన్ కుమార్ కోరారు.. నాకెందుకులే అని వదిలేయకుండా సామాజిక బాధ్యతగా బోర్డు ఏర్పాటు చేసిన జేడీ ఫౌండేషన్ ని పలువురు ప్రజలు,వాహనదారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జె.డి ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి హన్సి, శ్రీమతి పెద్దాడ ఆశాలత ,శ్రీ క డా లి నాగరాజు శ్రీ యూసుఫ్ మియా పాల్గొన్నారు.

Share it:

Post A Comment: