CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తాడ్వాయి మండలం ను ఎప్పుడు దత్తత తీసుకుంటారో చెప్పాలి

Share it:

 


మంత్రి ని డిమాండ్ చేసిన సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

తాడ్వాయి మండలం ని ఎప్పుడు దత్తత తీసుకుంటారో చెప్పాలి అని తాడ్వాయి మండల సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ డిమాండ్ చేశారు. నిన్న తాడ్వాయి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గత హామీలను మర్చిపోవడం చాలా బాధాకరం అని, తాడ్వాయి మండల ప్రజలే కాకుండా తెరాస కార్యకర్తలు కూడా ఎదురు చూసి నిరుత్సాహంగా ఉన్నారని రైతు లకు వ్యవసాయం కొరకు గోదావరి నీళ్లు ప్రతి ఎకరం కు ఇస్తా అని హామీ ఇచ్చి మర్చిపోయారు అని,గత స్థానిక ఎన్నికల సమయం లో తాడ్వాయి మండలంని దత్తత తీసుకొని 100 రోజులలో అభివృద్ధి ని పరుగులు పెట్టించి తలతల మెరిపిస్త అని హామీ ఇచ్చి జాతర అప్పుడు కనిపించి మళ్ళీ మేడారం జాతర వస్తుందని హడావుడి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికి అయినా పర్వాలేదు కానీ కొన్ని పనులు అయినా మండలం లో చేయాలి అని ఎందుకు అంటే ప్రభుత్వం ఉంది అని తాడ్వాయి మండల ప్రజలు మర్చిపోయి చాలా రోజులు అవుతుందని అన్నారు.త్వరలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ప్రభుత్వం లో చక్రం తిప్పేది కూడా ములుగు ఎమ్మెల్యే సీతక్క అని అప్పుడు తాడ్వాయి మండలం అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పురుషోత్తం నరసింహులు, సీతక్క యువసేన జిల్లా నాయకులు దుబాసి సుధాకర్, మండల యూత్ నాయకులు అంబటి రవి,యేనగంటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: