CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాటం చేద్దాం

Share it:

 


*చిన్న పత్రిక పెద్ద పత్రిక అనే తేడా లేదు.

*జర్నలిస్టులకు అక్రిడేషన్ ప్రామాణికం కాదు.

*అక్రిడేషన్ ప్రభుత్వ పథకాలకు మాత్రమే.

*టిఏజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రఘురామ్

*మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూర్ నాగారం మండల కేంద్రంలో తెలంగాణ ఆల్ జర్నలిస్టు ఫెడరేషన్ యూనియన్ ములుగు జిల్లా జర్నలిస్టుల జిల్లా స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు గంపల శివ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

సమావేశానికి ముఖ్య అతిథులుగా టిఏ జెఎఫ్ నాయకులు వెంకట యోగి రఘురాం,అధ్యక్షులు కూసం సారంగపాణి,జాతీయ కన్వీనర్వ్ దత్తాత్రేయ రాజేందర్,ప్రధాన కార్యదర్శి నూటేంకి ప్రభాకర్,సహాయ కార్యదర్శి విశ్వ ప్రసాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వచ్చి టిఏజెఎఫ్ యూనియన్ ఏర్పాటు ఆవశ్యకత గురించి ములుగు జిల్లా జర్నలిస్టులకు వివరించారు.పత్రికలలో చిన్న పత్రిక పెద్ద పత్రిక అనే తేడా ఉండదని ఆర్ఎన్ఐ నుండి ప్రభుత్వం జారీ చేయబడిన ఈ నెంబరు అందరికీ సమానంగా ఉంటుందని వారు తెలియ జేశారు.జర్నలిస్టులకు న్యా యంగా పొందవలసిన హక్కు లను సాధించుకోవడం కోసం అందరూ ఒక గొడుగు కిందికి వచ్చి సమిష్టిగా పోరాటం చేయ డం వల్ల ఏదైనా సాధించుకోవ చ్చని రాష్ట్ర నాయకులు అభి ప్రాయపడ్డారు.అనంతరం రాష్ట్ర కమిటీ నాయకులు ములుగు జిల్లా కమిటీని అధికారికంగా ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడుగా గంపల శివ కుమార్,ప్రధాన కార్యదర్శిగా బానోత్ వెంకన్న,ఉపాధ్యక్షు లుగా జానపట్ల జయరాజు, జగన్మోహన్,సునార్కని శ్యాం, సహాయ కార్యదర్శులు గా నాగరాజు, నాగేశ్వరరావు, ప్రచార కార్యదర్శిగా యాకుబ్ పాషా ను ఏకగ్రీవంగా ఎన్ని కయ్యారు.మిగతా వారిని ఈసి సభ్యులను రాష్ట్ర కమిటీ ఎన్నిక చేశారు.ఈ సమావే శంలోనే సభ్యత్వల నమోదు కార్య క్రమంను నిర్వహించారు. ఈ సమావేశంలో విలేకరులు మాట్లాడుతూ తాము గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్నా సమస్యలను యూనియన్ తరుపున పరిష్కరం అయ్యేలా చూడాలని కోరారు.ఈ సమావేశానికి విలేకరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: