CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బస్సు సౌకర్యం కల్పించండి

Share it:

 


.


 *అసైన్మెంట్ రూపంలో పరీక్షలు నిర్వహించి మార్కులు కలపండి.


 *ప్రమోట్ అయిన ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయండి.


 *ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘం

*కార్యాలయంలో ఆర్ ఐ సునీల్ కి వినతి పత్రం ఇచ్చిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు

మన్యం టీవీ మంగపేట.

భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం రోజున

 మంగపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి విద్యార్థులతో తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా అధ్యక్షుడు తోకల రవి మాట్లాడుతూ... బ్రాహ్మణపల్లి, రాజుపేట, నర్సింసాగర్, కొత్తపేట బిచ్చం పేట నుంచి మంగపేట కాలేజీ కి బస్సు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు 300 మంది విద్యార్థులు చదువుతున్నారు కానీ విద్యార్థులకు బస్సు సౌకర్యాలు లేక వారి ఇంటి నుంచి ప్రతి రోజు ప్రైవేట్ వాహనాలకు చార్జీలు అధిక భారం పడుతుంది అన్నారు . కళాశాలలో చదువుకునే విద్యార్థినిలు బస్సు సౌకర్యం లేక కళాశాలకు రావాలంటే పేద మధ్య తరగతి విద్యార్థులు కళాశాలకు రాలేకపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు కష్టాలు తీరే విధంగా స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు అందరూ స్పందించండి.ప్రభుత్వ విద్యను కాపాడే విధంగా వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా అక్టోబర్ 25వ తేదీ నుండి గత సంవత్సరం ప్రభుత్వం ప్రమోట్ చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్ష నిర్వహించాలని ఇంటర్ బోర్డు టైంటేబుల్ విడుదల చేసింది. ఈ పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డు పునరాలోచించాలి ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో గత 18 నెలలుగా కరోనా తీవ్ర రూపంలో విజృంభించింది.ఈ ఫలితంగా రాష్ట్రంలో విద్యాసంస్థలు మూతపడ్డాయి.దీంతో విద్యార్థులు పరీక్షలు నిర్వహించడానికి కి అవకాశం లేకపోవడంతో 2019-2020 విద్యా సంవత్సరం విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసింది.2020-2021 విద్యా సంవత్సరం కూడా పదవ తరగతి,ఇంటర్మీడియట్ విద్యార్థులను ప్రమోట్ చేశారు. కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకొని కార్పొరేట్ కళాశాలల కోసం పరీక్షలు సిద్ధం చేస్తుంది. కానీ ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వ కాలేజీల్లో 1700 గేస్ట్ లెక్చరర్ పోస్టులు రెన్యూవల్ చేయలేదు.దింతో ప్రభుత్వ కాలేజీల్లో ఆన్లైన్ లో కూడా తరగతులు జరగలేదు.లెక్చరర్ లేక పాఠాలు జరగక టీవీ పాఠాలు అర్థం కాక తీవ్ర ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొన్నారు.కరోనా తీవ్రత తగ్గడంతో మళ్ళీ విద్యాసంస్థల ప్రారంభం అయ్యాయి. కానీ ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్, గురుకులాలు ప్రారంభం కాలేదు.కానీ ప్రభుత్వం మాత్రం ఈ నెలలో పరీక్షలు పెట్టాలని షెడ్యూల్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలు ప్రారంభం కాకపోయినా, హాస్టల్స్ తెరవక పోయినా పరీక్షల పెడతామని ఇంటర్ బోర్డు మొండిగా పోవడం అంటే దేనికి.మన జిల్లాలో లో కనీసం ఇంటర్నెట్ సౌకర్యం లేక ఆన్లైన్ చదువులే సాగని కాలంలో ఈ పరీక్షలు పెట్టి ఏం చేస్తారు.ఈ పరీక్షలు రాసే విద్యార్థులు ప్రస్తుతం రెండవ సంవత్సరం చదువుకుంటూ,మొదటి సంవత్సరం పరీక్షలు రాయడం అంటే సాధ్యపడే అంశం కానేకాదు. విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోను చేసే అవకాశం ఎక్కువ కార్పొరేట్ కాలేజీలకు మాకే మొదటి ర్యాంకు మాకే అంటూ ప్రచారం ఆవిర్భావం చేసుకొని వారి వ్యాపార సామ్రాజ్యం పెంచుకోవడం తప్ప మరి దేనికీ పరీక్షలు ఉపయోగపడవు.ఎలాగో రెండవ సంవత్సరం పరీక్షలు విద్యార్థులు రాస్తారు. కాబట్టి మొదటి సంవత్సరం పరీక్షలను ప్రతి కళాశాలలో అసైన్మెంట్ రూపంలో నిర్వహించి, ఆ కళాశాల యాజమాన్యమే మార్కులు కలిపే విధంగా విద్యార్థులపై ఒత్తిడి లేకుండా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ములుగు జిల్లా కమిటీ కోరుతుంది.లేని యెడల ఆందోళన కార్యక్రమలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మేరేజ్ ఖాన్, వీరాజ్ ,శివ ,షఫీ ,బాలాజీ వంశీ, వినయ్ తో సహా 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: