CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సేవ్ ద చిల్డ్రన్ సంస్థ ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్ పంపిణీ

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

సోమవారం మంగపేట మండలంలోని పలు గ్రామాలలో సేవ్ ద చిల్డ్రన్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాలు, స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది మండలంలోని ఆరు గ్రామాల్లోని మొత్తం 200 మంది పిల్లలకు పలకలు, బలపాలు, నోట్ బుక్స్, పెన్సిల్స్, వైట్ బోర్డు, టార్పాలిన్ కవర్లు మొదలగు ఎడ్యుకేషన్ మెటీరియల్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తూరు గోత్తికోయ గ్రామంలోని పిల్లలకు సేవ్ ద చిల్డ్రన్ సంస్థ ఆధ్వర్యంలో కొత్తూరు మొట్లగూడెం గ్రామం పంచాయతీ సెక్రెటరీ జి చందూలాల్ చే ఎడ్యుకేషన్ మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది. కరోనా లాక్ డౌన్ కారణంగా విద్యకు దూరమైన పిల్లలందరికీ మళ్లీ విద్యాబుద్ధులు నేర్పించి పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరే నిమిత్తం గ్రామాల్లో ఉన్న వారికి విద్యాబుద్ధులు నేర్పించడం కోసం ప్రత్యేకమైన టీచర్లను సేవ్ ద చిల్డ్రన్ సంస్థ ద్వారా గ్రామాల్లో ఏర్పాటు చేయించి గ్రామస్తులకు నిరంతర విద్యను బోధించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామాల్లో నివాసం ఉంటున్న కుటుంబాల జీవనోపాధి అభివృద్ధిలో భాగంగా వెదురు బొంగు వస్తువుల ఉత్పత్తి కార్యక్రమాలు, మరియు తేనె ఉత్పత్తి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని సంస్థ మేనేజర్ ఎండి రఫీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఫిల్డ్ కోఆర్డినేటర్ రమేష్, ఎండి. షఫి, టీచర్ బి. నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: