CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

షెడ్యూల్ కార్మికుల సమ్మె నోటీసులు ఇచ్చిన : సీఐటీయూ

Share it:

 మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 73 రకాల షెడ్యూలు కార్మికుల కనీస వేతనం జీ ఓ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి ఏళ్ళు గడుస్తున్నా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని తక్షణం కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తు అక్టోబర్ 8న ఒక్క రోజు టోకెన్ సమ్మె నోటీసులు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సీఐటీయూ అధ్వర్యంలో జేకే 5 ఓసి పీ ఓ బొల్లం వెంకటేశ్వర్లు గారికి, ఓ బీ కాంట్రాక్టర్ ప్రతినిధి శర్మ గారికి సమ్మె నోటీసులు ఇచ్చిన అనంతరం సీఐటీయు ఇల్లందు ప్రాంతీయ కన్వీనర్ అబ్ధుల్ నబి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యవస్థ ను దెబ్బతీయడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలు కార్పోరేట్ శక్తులకు కారు చౌకగా అమ్మడానికి చూస్తున్నారని,44కార్మిక చట్టాలను 4 కోడులుగా కేంద్రం మార్చిందని,రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల యాజమాన్యాల చేతిలో కీలుబొమ్మగా మారి కనీస వేతనాల జీ ఓ ను అమలు పరచడం లేదని అందుకే షెడ్యూలు కార్మికుల సమ్మెను సీఐటీయు అధ్వర్యంలో  చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే కాలంలో మరిన్ని మిలిటెంట్ పోరాటాలు చేయడం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సీఐటీయు మండల కన్వీనర్ ఆలేటి కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు. కార్మికులు దాసరి మల్లయ్య, రాజేష్,రవి,సూరి,శ్రీను,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: