CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య పరీక్షలు..

Share it:

 



మన్యం టివి దుమ్ముగూడెం సెప్టెంబర్.04: దుమ్ముగూడెం మండలంలోని లక్ష్మినగరం ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి ఉచిత కంటి వైద్య పరీక్షలకు మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతం నుంచి 2000 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం ఏ ఎస్ పి డాక్టర్ వినీత్ ఐపీఎస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక సి ఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. అలానే వైద్యపరీక్షల్లో 2000 మంది పాల్గొనగా అందులో 500 మందికి కళ్లద్దాలు, 200 మందికి ఆపరేషన్లు అవసరమవుతాయని వైద్య పరీక్షలు నిర్వహించిన బృందం తెలిపారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వాలంటీర్ గా మండలంలోని స్థానిక బ్యూటిఫుల్ లైఫ్ అసోసియేషన్ స్వచ్ఛంద సంస్థ వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ ఐ రవి కుమార్ ,సిఆర్పిఎఫ్ 141 అసిస్టెంట్ కమెండో రేవతి ,డాక్టర్ రమాకాంత్, డాక్టర్ ఎస్ తేజస్విని, డాక్టర్ కార్తీక్, డాక్టర్ ఎస్ అరవింద్ ఎండి ఆప్టిషన్, డాక్టర్ బాలాజీ దుమ్ముగూడెం, డాక్టర్ చైతన్య, డాక్టర్ మందీప్ పర్ణశాల పాల్గొన్నారు.

Share it:

Post A Comment: