CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎల్ టి ఆర్ కేసులను త్వరిత గతిన పరిశీలించండి

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ఏటునాగారం ఐటిడిఏ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ ఏటూరు నాగారం ఐటిడిఏ ఇన్చార్జి పీవో ఎస్.కృష్ణ ఆదిత్య ఐటిడిఏ పరిధిలో వివిధ శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్ష లో ఎల్ టి ఆర్ కేసుల వివరాలు మరియు గ్రీవెన్స్ దరఖాస్తులు ఉన్నట్లు అయితే త్వరిత గతిన పరిష్కరించాలని,జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఐటడీఏ పరిధిలోని పాఠశాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.దినసరి మరియు కంటింజెంట్ వారి వేతనాలు క్రమం తప్పకుండా ఇప్పించాలని వారు అన్నారు.

ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ పరిధిలోని అన్ని ఫైల్స్ గ్రాంట్స్ వారీగా క్రోడీకరించి ఈ ఆఫీస్ ద్వారా ఫైల్స్ సమర్పించాలని అన్నారు. ఎఫ్ డి సి యందు గల ఎడ్యుకేషనల్ కంపొనెంట్ యందు గల పేమెంట్స్ ని పరిశీలించి మంజూరుకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.ఐటీడిఏ పరిధిలో కార్యాలయాల రికార్డ్ రూం లోని రికార్డులు పరిశీలించి క్రమపద్ధతిలో ఉండాలని తెలిపారు.మేడారం జాతర కు సంబందించిన ఐటిడిఏ పరిధిలోని ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పనుల వివరాలను మరియు ఇతర సంబంధిత శాఖల పనుల ప్రతిపాదనలను పూర్తి చేసి టెండర్ నిర్వహణ కోసం ప్రతి పాదనలు తయారు చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీవో వసంత రావు,ట్రైబల్ వెల్ఫేర్ ఇఇ హేమలత,ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఎర్రయ్య,ఏవో దామోదర్ స్వామి,మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: