CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో తహసిల్దార్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది.

Share it:



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఆదివాసీ సంక్షేమ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి పూనెం సురేష్ గారు  ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఇల్లందు మండల అధ్యక్షులు చింత ఉపేందర్ గారు మాట్లాడుతూ. .సుదిమల్ల గ్రామపంచాయతి  బొజ్జాయి గూడెం గ్రామ పంచాయతి అలాగే సుభాష్ నగర్ గ్రామ పంచాయతీల పరిధిలో 1/59,1/70 చట్టాలకు విరుద్ధంగా గిరిజనేతరులు అక్రమ ఇండ్ల కట్టడ నిర్మాణాలు చేపడుతున్న కూడా  రెవిన్యూ సిబ్బంది వాటిపై చర్యలు తీసుకోవడం దుర్మార్గపు చర్య అని వారు ఆరోపించారు.


వ్యవసాయ భూములలో ఇండ్ల నిర్మాణం చేపట్టాలంటే నాల కన్వర్షన్ చేయాల్సి ఉండగా ఈ చట్టాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వ్యవసాయ భూములు అయినటువంటి అసైన్మెంట్ భూముల లో ప్రభుత్వ భూముల్లో ఇళ్ల నిర్మాణాలు చేపడుతుంటే చట్టాలు అమలు చేయాల్సిన తహసిల్దార్ కార్యాలయం వారు నా పరిధి కాదని చేతులు దులుపుకుంటున్నారు అంటే ఎంత చేతులు మారినా అర్థం చేసుకోవాలి ఇలాంటి అధికారుల వల్లనే ఈరోజు ఐదవ షెడ్యూల్ ప్రాంతం లోని 1/59,1/70 చట్టాల అమలు కావట్లేదని వారు ఆరోపించారు.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు ఇకనైనా మీరు ఏజెన్సీ ప్రాంతంలోని చట్టాలను అమలయ్యే విధంగా చూడాలని లేనియెడల ఏజెన్సీ ప్రాంతంలోని చట్టాలకు మొత్తం కూడా మీ కిందిస్థాయి అధికారులు తూట్లు పొడుస్తున్నారని దీనికి ఉదాహరణ ఇల్లందు తహసిల్దార్, గ్రామ పంచాయతీ సిబ్బంది చూడవచ్చని వారన్నారు ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతంలోని చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు 

ఈ కార్యక్రమంలో సనప గోవర్ధన్, కిన్నెర కిషోర్, కల్తీ రవీందర్, కృష్ణ, మండల అధ్యక్షులు బాలకృష్ణ, ఊకే రాజు, సుధాకర్ మొదలగు వారు పాల్గొన్నారు

Share it:

Post A Comment: