CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పీకే ఓసి-2 లో దసరా ఉత్సవాల సందర్భంగా శరన్నవరాత్రోత్సవాలు

Share it:

 


అన్నపూర్ణాదేవిగా మహాలక్ష్మి దేవి గా దర్శనమిచ్చిన అమ్మవారు భక్తులకు నయనానందకరం, భక్త పారవశ్యంతో పరవశించిన భక్తులు


మన్యం టీవీ మణుగూరు: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా పీకే ఓ సి సెక్షన్ 2 ఆవరణలో పైన ఉన్న శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారి ఆలయం లో దసరా ఉత్సవాల సందర్భంగా శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నారు.సోమవారం నాడు అమ్మవారు అన్నపూర్ణ దేవిగా,మహాలక్ష్మి దేవిగా, దర్శనమిచ్చి భక్తులకు నాయనానందాన్ని పంచారు. భక్తి పారవశ్యంతో భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఓసి 2 లో అమ్మవారి ఆలయం లో అర్చకులు శ్రీ మంథా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుహాసినులచే సహస్ర కుంకుమార్చన కార్యక్రమం జరుపబడింది.అలాగే హనుమాన్ భక్త బృందం పి వి కాలనీ వారిచే హనుమాన్ చాలీసా పారాయణం,లలితా సహస్రనామ స్త్రోత్రం,భజన కార్యక్రమాలు జరిగాయి.ఎంతో భక్తి శ్రద్దలతో అందరూ అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.దీని కోసం ఆలయ కమిటీ వారు మహిళా భక్తులకు కాలనీ నుండి వాహన సదుపాయం కల్పించారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయంలో,విస్తృత ఏర్పాట్లు చేసారు.ఈ పూజలో ఆలయకమిటీ చైర్మన్, రాంబాబు సతీమణి నాగప్రసన్న పాల్గొన్నారు.అలాగే ఆలయ కమిటీ సభ్యులు దండమూడి రాంబాబు, లింగబాబు,సెక్రటరీ మదార్ సాహెబ్,సభ్యులు ఎన్ సి హెచ్ పవన్,మాధవాచారి,సత్యనారాయణ,లింగయ్య,సత్యం,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: