CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దీర్ఘ వ్యాధుల నివారణకు దివ్యౌషధం చిరుధాన్యాలు

Share it:



 మన్యంటీవి, అశ్వరావుపేట:

 ప్రస్తుతం మూడు పూటలా సన్నబియ్యం ఆహారం తింటూ ఉన్నందున ఫైబర్ పూర్తిస్థాయిలో అందక జీర్ణ వ్యవస్థ శుభ్ర పడక అనేక రోగాల బారిన పడుతున్నారని అశ్వారావుపేట మండల ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జడ్పిటిసి చెన్నంశెట్టి వర లక్ష్మి అన్నారు. అశ్వరావుపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు, నీతి అయోగ్, వాసం సంస్థలు ఆధ్వర్యంలో తిరుమల కుంట కాలనీ రైతు వేదికలో అల్లిగూడెం అంగన్వాడి సెంటర్ లో వేరువేరుగా అంగన్వాడీలు చిరు ధాన్యాల ఆహార పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో చిరుధాన్యాలు ఆహార పదార్థాలను చిరుధాన్యాలను ప్రదర్శించారు. ముందుగా రైతు వేదికను మామిడి తోరణాలతో అలంకరించారు. తయారుచేసిన చిరుధాన్యాల వంటలను చిన్నారులకు, గర్భిణీలకు, పిల్లలు తల్లులకు గ్రామస్తులకు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీపీ, జడ్పిటిసి మాట్లాడుతూ వరి గోధుమల్లో పీచు పదార్ధం తక్కువగా ఉంటుందని ఎరువులు పురుగుమందులు లేని ఆహారమే కరువైందని అన్నారు. పూర్వికులు ఆరోగ్యవంతంగా ఉండటం, ఆనాడు రోగాలు కూడా తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం చిరుధాన్యాల లే అని చెప్పారు. ఇప్పుడు సిరి ధాన్యాలు పండించుకొని ఆ ఆహారమే తీసుకోవాలని ప్రజలకు సూచించారు కొర్ర రాగులు అరికలు సామల లో సమతుల్య ఆహారం ఉంటుందని ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు ఆహారం తీసుకోవాలని కోరారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు తల్లులు చిన్నారులు గ్రామస్థులతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో నృత్యాలు చేసి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సరస్వతి, యాట్ల మహేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ నారం నాగలక్ష్మి, ఉప సర్పంచ్ రాంబాబు, సిడిపిఓ రోజా రాణి, సూపర్వైజర్ విజయలక్ష్మి, చిరుధాన్యాల జిల్లా కోఆర్డినేటర్ బి మోహన్, గ్రామస్తులు బి చెన్నారావు, వెంకన్న బాబు, పి లక్షణరావు, అన్నం లక్ష్మయ్య, వార్డు మెంబర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సంస్థ ప్రతినిధి, సి ఆర్ పి ఈశ్వర్ తల్లులు చిన్నారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: