CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ములుగు జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు 9 లక్షల 44,500 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ను లబ్ధిదారులకు అందజేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అన్నారు. అదేవిధంగా గత మూడు సంవత్సరాల నుండి కొత్త పెన్షన్స్ రాక ఇబ్బందులు పడుతున్నారని మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి తో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఒత్తిడి చేయడంతో 57ఏళ్ల దాటిన వాళ్లకి పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది అని చెప్పడమే కాదు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం లబ్ధిదారులను గుర్తించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని జిల్లా మండల అధికారులు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులకు సహకరించాలని ఈ సందర్భంగా సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు భానోత్ రవి చందర్,మండల అధ్యక్షుడు ఎండి చాంద్ పాషా,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, సహకార సంఘం చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి, సర్పంచులు ముద్ద బోయిన రాము,పిడ బోయిన స్వామి,మాజీ జెడ్పిటిసి కంది మల్ల మధుసూదన్ రెడ్డి, వెంకటాపురం మండల అధ్యక్షుడు చెన్నోజు సూర్యనారాయణ,మాజీ మండల అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాస్,మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి ముజఫర్, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సీతారాం నాయక్,సహకార సంఘం డైరెక్టర్ మాధవ రెడ్డి, ఉపసర్పంచులు లింగారెడ్డి, దేవేందర్ రెడ్డి,జంపాల చంద్రశేఖర్,బీసీ సెల్ మండల అధ్యక్షుడు తోట ప్రవీణ్, ఎర్రబెల్లి దేవేందర్ రావు,మేడం రమణా కర్,దబ్బ గట్ల రవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: