CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగపేట లో సడక్ బంద్ విజయవంతం

Share it:

 


మన్యం టీవీ మంగపేట.మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల పక్షాల అధ్వర్యంలో తలపెట్టిన సడక్ బంద్ కార్యక్రమనికి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, డీసీసీ అధ్యక్షులు నల్లెల కుమరన్న పిలుపు మేరకు మండల కేంద్రంలో సుమారు గా 600 మంది రైతుల తో పొడుభూముల మహా ధర్నా ని కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో భాగంగా ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య మాట్లాడుతూ కొత్త పోడు కొట్టేది లేదు పాత పోడు వదులుకునే లేదు పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని పోడు రైతుల పై పారెస్ట్ అధికారుల దాడులను ఆపాలి రైతుల పై అక్రమ కేసులు ఆపాలని ఈ వర్షకాల అసెంబ్లీ సమావేశాల్లో పోడు భూములకు పట్టాలు ఇచ్చే విధంగా తీర్మానం చేయాలి అని పోడు రైతులకు పట్టాలు వచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుంది అని ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య అన్నారు . ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు మైల జై రాం రెడ్డి, ఉమ్మడి జిల్లాల ఉపాధ్యక్షులు పూజారి సురేందర్ బాబు, కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి వల్లిపల్లి శివప్రసాద్, ఉప అద్యక్షులు తూడి భగవాన్ రెడ్డి ప్రధాన కార్యదర్శులు అయ్యేరి యానయ్య, కొంకతి సాంబశివరావు కాటా బోయిన నరసింహారావు, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి ల్యావుడా శ్యామ్ లాల్, యూత్ జిల్లా కార్యదర్శి కర్రీ నాగేంద్ర బాబు, కిసాన్ సెల్ మండలాధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పల్లికొండ యాదగిరి, ఎస్టీసెల్ మండల అధ్యక్షులు చాలా మల్లన్న, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు హిదయతుల్లా, మైనార్టీ సెల్ జిల్లా నాయకులు మహబూబ్ ఖాన్, సీతక్క యువసేన మండల అధ్యక్షులు సిద్ధ బత్తుల జగదీశ్వర రావు, సింగిల్ విండో డైరెక్టర్ బాలకృష్ణ, మండల మహిళ ప్రధాన కార్యదర్శి చింతా చంద్రావతి, మండల అధికార ప్రతినిధి బండ జగన్, సీనియర్ నాయకులు శ్రీ రెడ్డి వెంకట్ రెడ్డి, కారుబోతుల నర్సన్న, దామేర సారయ్య, ధీగొండ కాంతారావు, సర్థన నరసయ్య,లక్ష్మీపతి, పొడెం గణేష్, తోలెం సురేందర్, నర్రా కిషోర్, పడమతింటి శ్రీనివాస్, ఉజ్వల్, పోడెం భూషణం,తోట అశోక్, తోలేం స్వామి, యూత్ నాయకులు జంగం బానుచందర్, కూర్సం రమేష్, .షేక్ మొయినుద్దీన్, ఎల్పీ నర్సయ్య, మోహన్,బందపల్లి నర్సయ్య, వడ్లకొండ లక్ష్మి నర్సయ్య గారు . ముగల చంటి,గారు,తొలెం కృష్ణ మూర్తి,బంగారు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: