CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పొడుభూములపట్టాల కోసం అఖిల పక్షాల ఆధ్వర్యంలోరాస్తారోఖో

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

మండల కేంద్రంలో అఖిలపక్షం ఆద్వర్యంలో 2గంటల పై చిలుకు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి గపూర్ పాష,భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాయని గిరిజనులకు అన్యాయం చేస్తున్నాయని ఈ సందర్భంగా విమర్శించటం జరిగింది. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాలు వరకు అటవీ భూమికి పట్టాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎవరికీ ఒక్క ఎకరం భూమికి పట్టా ఇవ్వలేదు. తెలంగాణా రాష్ట్రంలో గిరిజనులు, పేదలు సాగుచేసుకుంటున్నటువంటి పోడు భూములు 13,03,847 ఎకరాలు. ఇందులో అటవీ హక్కుల గుర్తింపు చట్టం -2006 ప్రకారం 2008 నుంచి 2011 వరకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. గ్రామసభల నుండి గిరిజనులు, పేదలు దరఖాస్తులు పెట్టుకోగా వేలాది దరఖాస్తులను తిరస్కరించారు. అయినా 2,12,173 వ్యక్తిగత దరఖాస్తులను హక్కులు కల్పించేందుకు నాటి ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఈ దరఖాస్తుల పరిధిలో 7,61,061 ఎకరాల భూమిపై హక్కులు కల్పించవచ్చని నిర్దారించింది. కానీ 93,639 దరఖాస్తులకు 3,00,284 ఎకరాలకు మాత్రమే హక్కులు కల్పించారు. మిగిలిన 1,18,534 దరఖాస్తులను కారణాలు చూపకుండా తిరస్కరించింది. ఇంకా 10లక్షల ఎకరాల వరకు హక్కు పత్రాలు ఇవ్వాలి. పై గణాంకాలన్నీ 2020 డిసెంబర్ 31న కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలో ఉన్నవి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక్క ఎకరా భూమిపై కూడా హక్కులు కల్పించలేదు.ఇవ్వలేదు గిరిజనులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు కేసులు బనాయిస్తూ జైల్లకు పంపుతున్నారు. ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై భౌతిక దాడులు చేస్తూ వారి మాన ప్రాణాలను దోచుకుంటున్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గత పది మాసాలుగా ఉద్యమిస్తున్న రైతులపై కేంద్రంలోను, యూపీలోని బీజేపీ ప్రభుత్వాల నిరంకుశత్వం పరాకాష్టకు చేరిందని. ఇప్పటి వరకు లాఠీచార్జీ, జలఫిరంగులతో రైతులపై ఉక్కుపాదం మోపుతున్న బీజేపీ పాలకులు తాజాగా రైతుల ప్రాణాలు తీయడానికి బీజేపీ బరితెగించిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. యూపీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి అజెయ్ మిశ్రా తనయుడు ఆశిష్‌ (సోను) మిశ్రా కాల్పులు జరిపి, ఆ పై కారు కాన్వాయ్ తో తొక్కించి నలుగురు అన్నదాతలను ఒక జర్నలిస్ట్ ను అమానుషంగా పొట్టన పెట్టుకున్నాడని జరిగిన ఈ కిరాతక ఘటన దేశాన్ని నివ్వెరపరచిందని ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా యూపీ అంతటా నిరసనలు పెల్లుబికాయని వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సంఘీభావంగా ప్రజలు ఎక్కడికక్కడ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియచేసిన కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదని వారి డిమాండ్ పరిష్కరించబోగ రైతులను రెచ్చగొట్టే దుశ్చర్యలు పాల్పడుతు చివరకు వారి ప్రాణాలు తీసే స్థాయికి దిగజారిన బీజేపీ ని ఈ దేశం నుండి తరిమికొట్టే రోజు ఎంతో దూరం లో లేదని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత పది మాసాలుగా సాగిస్తున్న రాజీలేని పోరును అపహాస్యం చేసేలా ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే లఖింపూర్‌లో రైతుల శాంతియుతన నిరసనను రక్తపుటేరుల్లో ముంచడం సభ్య సమాజానికి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఘాటుగా విమర్శించారు. ఇప్పటికైనా గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎల్పీ ముత్యాల ,మండల నాయకులు నర్ర శివప్రసాద్ ,సిఐటియు మండల కార్యదర్శి వెంకటరెడ్డి, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పూనం నాగేష్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జాఘటి చిన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వీర్రాజు, పోడు రైతుల తో సహా 500 మంది పాల్గొన్నారు.కోసం అఖిల పక్షాల ఆధ్వర్యంలోరాస్తారోఖో* 

మన్యం టీవీ మంగపేట.

మండల కేంద్రంలో అఖిలపక్షం ఆద్వర్యంలో 2గంటల పై చిలుకు రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి గపూర్ పాష,భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాయని గిరిజనులకు అన్యాయం చేస్తున్నాయని ఈ సందర్భంగా విమర్శించటం జరిగింది. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి 10 ఎకరాలు వరకు అటవీ భూమికి పట్టాలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎవరికీ ఒక్క ఎకరం భూమికి పట్టా ఇవ్వలేదు. తెలంగాణా రాష్ట్రంలో గిరిజనులు, పేదలు సాగుచేసుకుంటున్నటువంటి పోడు భూములు 13,03,847 ఎకరాలు. ఇందులో అటవీ హక్కుల గుర్తింపు చట్టం -2006 ప్రకారం 2008 నుంచి 2011 వరకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. గ్రామసభల నుండి గిరిజనులు, పేదలు దరఖాస్తులు పెట్టుకోగా వేలాది దరఖాస్తులను తిరస్కరించారు. అయినా 2,12,173 వ్యక్తిగత దరఖాస్తులను హక్కులు కల్పించేందుకు నాటి ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఈ దరఖాస్తుల పరిధిలో 7,61,061 ఎకరాల భూమిపై హక్కులు కల్పించవచ్చని నిర్దారించింది. కానీ 93,639 దరఖాస్తులకు 3,00,284 ఎకరాలకు మాత్రమే హక్కులు కల్పించారు. మిగిలిన 1,18,534 దరఖాస్తులను కారణాలు చూపకుండా తిరస్కరించింది. ఇంకా 10లక్షల ఎకరాల వరకు హక్కు పత్రాలు ఇవ్వాలి. పై గణాంకాలన్నీ 2020 డిసెంబర్ 31న కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలో ఉన్నవి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక్క ఎకరా భూమిపై కూడా హక్కులు కల్పించలేదు.ఇవ్వలేదు గిరిజనులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుడు కేసులు బనాయిస్తూ జైల్లకు పంపుతున్నారు. ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై భౌతిక దాడులు చేస్తూ వారి మాన ప్రాణాలను దోచుకుంటున్నారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా గత పది మాసాలుగా ఉద్యమిస్తున్న రైతులపై కేంద్రంలోను, యూపీలోని బీజేపీ ప్రభుత్వాల నిరంకుశత్వం పరాకాష్టకు చేరిందని. ఇప్పటి వరకు లాఠీచార్జీ, జలఫిరంగులతో రైతులపై ఉక్కుపాదం మోపుతున్న బీజేపీ పాలకులు తాజాగా రైతుల ప్రాణాలు తీయడానికి బీజేపీ బరితెగించిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. యూపీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి అజెయ్ మిశ్రా తనయుడు ఆశిష్‌ (సోను) మిశ్రా కాల్పులు జరిపి, ఆ పై కారు కాన్వాయ్ తో తొక్కించి నలుగురు అన్నదాతలను ఒక జర్నలిస్ట్ ను అమానుషంగా పొట్టన పెట్టుకున్నాడని జరిగిన ఈ కిరాతక ఘటన దేశాన్ని నివ్వెరపరచిందని ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా యూపీ అంతటా నిరసనలు పెల్లుబికాయని వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సంఘీభావంగా ప్రజలు ఎక్కడికక్కడ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలియచేసిన కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదని వారి డిమాండ్ పరిష్కరించబోగ రైతులను రెచ్చగొట్టే దుశ్చర్యలు పాల్పడుతు చివరకు వారి ప్రాణాలు తీసే స్థాయికి దిగజారిన బీజేపీ ని ఈ దేశం నుండి తరిమికొట్టే రోజు ఎంతో దూరం లో లేదని అన్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత పది మాసాలుగా సాగిస్తున్న రాజీలేని పోరును అపహాస్యం చేసేలా ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే లఖింపూర్‌లో రైతుల శాంతియుతన నిరసనను రక్తపుటేరుల్లో ముంచడం సభ్య సమాజానికి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఘాటుగా విమర్శించారు. ఇప్పటికైనా గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎల్పీ ముత్యాల ,మండల నాయకులు నర్ర శివప్రసాద్ ,సిఐటియు మండల కార్యదర్శి వెంకటరెడ్డి, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పూనం నాగేష్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జాఘటి చిన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వీర్రాజు, పోడు రైతుల తో సహా 500 మంది పాల్గొన్నారు.

Share it:

Post A Comment: