CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ ఆంధ్ర సరిహద్దులో పోడు సాగుదారుల పొలికేక

Share it:

 



 *హాజరైన అఖిలపక్ష రాష్ట్ర నేతలు


 *పట్టాలు ఇవ్వకుంటే పోడు ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరిక


 మన్యంటీవి, అశ్వారావుపేట:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సీపీఐ, సీపీఎం, తెలుగుదేశం, కాంగ్రెస్, టీజేఎస్, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన పోడు సాగు దారుల పొలికేక అశ్వారావుపేటలో జరిగింది. అశ్వారావుపేట నుండి ఆదిలాబాద్ వరకు పోడు సాగుదారుల పొలికేక కార్యక్రమానికి భారీ సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. అశ్వారావుపేట పట్టణంలోని ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని చెక్ పోస్ట్ వద్ద చేపట్టిన రాస్తారోకో కార్యక్రమంలో వామపక్ష కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై రాష్ట్ర ప్రభుత్వం గిరిజన వ్యతిరేక విధానాలపై నినదించారు. పొలికేక కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు బత్తిన నర్సింహులు, కాంగ్రెస్ నాయకులు మొగళ్లపు చెన్నకేశవరావు పాల్గొని ప్రసంగించారు. జిల్లా నలుమూలల నుంచి అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోడు భూములు పట్టాలు కీలకమని ఆనాడు వైస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన పట్టాలు తప్ప మళ్ళీ ఒక్క ఎకరాకు కూడా పట్టాలు ఇవ్వలేదని, తెలంగాణ ఉద్యమంలో చెప్పిన మాట మర్చిపోయావా కెసిఆర్ అని, ఆనాడు తెలంగాణ వస్తే పోడు వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి పోడు భూములకు పట్టాలు ఇస్తనన్నావు, ఆ మాట ఇప్పుడు ఏమైంది కేసీఆర్, హరితహారం పేరుతో కేంద్రం నుండి 5200 కోట్లు తెచ్చుకుని ఎన్ని మొక్కలు నాటారో కేసీఆర్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని, తెరాస నాయకులు జేబులు నింపుకుంటానికే హరితరహారం కార్యక్రమం పెట్టారని, కాదని అంటే శ్వేతపత్రం విడుదల చేసి నిరూపించుకోవాలని వారు విమర్శించారు. కేసీఆర్ ఖమ్మం జిల్లా జైల్లో నిన్ను పెడితే నీకోసం ఒక్కరు కూడా రాలేదని, కేవలం వచ్చింది కేవలం కమ్యూనిస్ట్ లు మాత్రమేనని, నీకోసం మేమె వచ్చాం. ఈ రోజు అడవి బిడ్డల కోసం మేమె వస్తాం అది మర్చిపోవద్దన్నారు. అలానే హుజురాబాద్ నియోజకవర్గానికి 2000 కోట్లు ఖర్చు పెడుతున్న కేసీఆర్, దళిత బంధు పథకం ద్వారా మా అశ్వారావుపేట సత్తుపల్లి నియోజకవర్గాల్లో అమలు చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో కుర్చీ వదలాల్సిందేనని వారు హెచ్చరించారు. అశ్వారావుపేట లో మెచ్చ నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు టీడీపీ, కాంగ్రెస్ తరపున గెలిచి, పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తా అంటూ కార్ ఎక్కారని, మీరు ఆదివాసుల కోసమా వెళ్ళింది, లేదా మీ ఆస్తులు కాపాడుకోవడం కోసమా అని ప్రశ్నించారు. రేగా కాంతారావు పేపర్స్ లో టీవీ లో కనిపించడానికి మాత్రమేనని, పోడు భూములు ఉన్న ఊళ్ళోళ్ళకి అటవీశాఖ అధికారులు వస్తే తరిమి కొట్టండి అంటూ మనకు చెప్పారని, మరి అసెంబ్లీ లో కేసీఆర్ ముందు ఎందుకు మాట్లాడరని విమర్శించారు. కొకాపేట భూములు క్రమబద్ధీకరణ చేసిన కెసిఆర్, పోడు రైతులకు మాత్రం పట్టాలు ఎందుకు ఇవ్వవు అని వారు ప్రశ్నించారు. గ్రామాల్లో కొంతమంది తెరాస పార్టీ నాయకులు మీ పేర్లు ఇవ్వండి మేము పట్టాలు ఇప్పిస్తాం అంటూ మనల్ని విడతీసే ప్రయత్నం చేస్తున్నారని, ఆ మాటలు మీరు నమ్మకండి. అందరం కలిసుండి మన భూములకు పట్టాలు వచ్చే వరుకు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణా వచ్చాక ఎన్నో కొత్త చట్టాలు తెస్తానన్న కేసీఆర్ కొత్త చట్టాలు తేకపోగా తెలంగాణా రాకముందు ఉన్న చట్టాలను సైతం తుంగలో తొక్కుతున్నారని, తెలంగాణా ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాలు గడిచినప్పటికి ఒక్క ఎకరాకు కూడా పోడు భూమి కి పట్టా ఇవ్వలేదని అలానే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే పోలీసులు పోడు భూముల రైతులు పై ఎందుకు కేసులు పెడుతున్నారని, కేసీఆర్ ప్రభుత్వం పోలీసులను అటవీశాఖ అధికారులును చేతిలో పెట్టుకుని వారిని అడ్డగోలుగా వాడుతున్నారని, పోడు భూములకు పట్టాలు వచ్చే వరుకు అన్ని అఖిల పక్ష పార్టీలన్నీ కలిసే ఉంటాయని, పోడు భూములకు పట్టాలు ఇస్తే పోలీసులు తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం లేదని, పోలీసులను అటవీ శాఖ అధికారులను ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్న కేసీఆర్ పైనే కేసు పెట్టాలని, పోడు భూముల చట్టాలను అడ్డుకుంటున్న కేసీఆర్ పై కేసులు పెట్టి జైలుకు పంపాలని వారన్నారు. హరితహారం పెట్టిందే కోతులు కోసమని, ఓటు లేని కోతి పైనే అంత ప్రేమ ఉంటే ఓటు ఉన్న పొడు రైతు పై ఎంత ప్రేమ ఉండాలని, చలోక్తులు విసిరారు. దళితు బంధు పెట్టి దళితులకు ఒక్కరికే న్యాయం చేయడమే కాదని, తెలంగాణా లో ప్రతి ఒక్క పేదవాడికి పది లక్షల రూపాయలు ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా మాయ వేషాలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, కోతి వేషాలు మాయ మాటలు ఇకనైనా ఆపి పోడుసాగుదారులకు పట్టాలివ్వాలని వారు కోరారు. నిండు అసెంబ్లీ లో పోడు రైతులపై నాకు శ్రద్ద ఉంది అన్న కేసీఆర్ కేంద్రప్రభుత్వం తో చర్చించేందుకు ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి చట్టాన్ని మార్చాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఢిల్లీ వెళ్ళడానికి అఖిల పక్షానికి సమ్మతమేనని, కానీ 2005 కు ముందు ఉన్నవారికి పట్టా ఇచ్చి తరవాత ఢిల్లీకి వేళదామని వారు కేసీఆర్ ను కోరారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోతే ఈ ఉద్యమం పోడు భూములు ఉన్న గ్రామాల్లో తెరాస పార్టీ జెండా ను రానివ్వకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ అశ్వారావుపేట నుండి ఆదిలాబాద్ వరుకు పోడు పొలికేక ధర్నా జరుగుతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ద్వారా నువ్వు చూడాలంటూ,దేశానికి 1947 లో స్వతంత్రం వచ్చినప్పటికీ 1946లో దొరలకు ఎదురు తిరిగి దున్నేవాడిదే భూమి అన్న వర్గాలు బడగుబాలహీన వర్గాలేనని 1946 లో దొరలు ఎలా అయితే చిన్నచూపు చూశారో ఇప్పుడు కేసీఆర్ అదే తంతు చేస్తున్నాడని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చట్టం చేయడానికి పోరాటం చెయ్యాలని, చట్టం వచ్చాక ఆ చట్టాన్ని అమలు కోసం మరో పోరాటం చెయ్యాల్సి వస్తుందని, చట్టం ఉన్నవాడికి చుట్టంలా మార్చేచేస్తున్నారని దుయ్యబట్టారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే కేసీఆర్ మన భూమలును కాజేస్తున్నాడని, హరితహారం పేరుతో గిరిజనుల నుండి పోడు పొలాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడని,ఆ నాడు తెలంగాణా రావడానికి అఖిల పక్షాలు వామ పక్షాలు ముఖ్య పాత్ర పోషించడం వల్లే తెలంగాణ వచ్చిందని, తెలంగాణ ఒక్కడి సొత్తు కాదని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అడపిల్లల్ని పసి పిల్లలను సైతం జైల్లో పెట్టిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని, పోడు చేసుకున్న గిరిజనులను జైల్లో ఎందుకు పెట్టావని వారు ప్రశ్నించారు. గతంలో పోడు రైతుల పై గిరిజనుల పై ఉన్న కేసులు ఎత్తేయాలని,

అలానే అటవీశాఖ రెవెన్యూ శాఖ సరిహద్దు తేల్చాలని, వారు కోరారు. కేసీఆర్ చెప్పిన విదంగా 6 లక్షల ఎకరాల భూమి పేద వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారని, వెంటనే భూములకు పట్టాలు ఇవ్వాలని, లేనిచో ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుందని వారు హెచ్చరించారు. ఇంకా ఈ సభలో కాంగ్రెస్, తెలుగుదేశం, టీజేఎస్,ఆదివాసి సంఘం నాయకులు మాట్లాడారు. అఖిలపక్ష రాజకీయ పార్టీల రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా జరుగుతున్న సరిహద్దు రహదారుల దిగ్బందనం, పోడు సాగు దారులపై పొలికేక కార్యక్రమానికి అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు కూరపాటి పుల్లయ్య, చిరంజీవి, నరాటి ప్రసాద్, గోకినేపల్లి ప్రభాకర్, అమర్లపూడి రాము, కంగాల కల్లయ్య, దుర్గమ్మ, సంధ్య, సయ్యద్ సలీం, రఫీ తెలుగుదేశం నాయకులు కట్రం స్వామి దొర, నార్లపాటి శ్రీను, కాంగ్రెస్ నాయకులు, తుమ్మ రాంబాబు, జేష్ఠ సత్యనారాయణ చౌదరి, ముళ్ళగిరి కృష్ణ, ఆదివాసి సంఘం నాయకులు పాయం దుర్గారావు మరియు పెద్ద ఎత్తున పోడు సాగు దారులు నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: