CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి లాభాల్లో కాంట్రాక్టు కార్మికులకు కూడా వాటా చెల్లించాలి.

Share it:

 


మన్యం టీవి, మణుగూరు:

 ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి డిమాండ్.


 సింగరేణి వార్షిక లాభాలలో కాంట్రాక్టు కార్మికులకు కూడా వాటా చెల్లించాలని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి వార్షిక లాభాలలో కాంట్రాక్టు కార్మికులకు కూడా వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో స్థానిక జిఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.


               ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్మినెంట్ కార్మికులతో సమానంగా కాంట్రాక్టు కార్మికులు కూడా పనిచేస్తూ సంస్థ లాభాల లో భాగస్వామ్యం అవుతున్నప్పటికీ పర్మినెంట్ కార్మికులకు లాభాల వాటా ప్రకటించి, కాంట్రాక్టు కార్మికులకు ప్రకటించక పోవడం దారుణమన్నారు. ఒకే లక్ష్యం, ఒకే గమ్యం, ఒకే కుటుంబం అని నీతి సూత్రాలు వల్లించే సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల పట్ల ఎందుకు వివక్ష చూపుతోందని ప్రశ్నించారు. సింగరేణి కి వచ్చే లాభాలు కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడీ వల్ల వచ్చే లాభాలు తప్ప మరొకటి కాదన్నారు. ఒక్క పర్మినెంట్ కార్మికుడికి ఇచ్చే వేతనంతో 7 గురు కాంట్రాక్టు కార్మికులతో పని చేయించుకుంటూ వారి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు సర్వీసు 61 సంవత్సరాలకు పెంపు, లాభాల వాటా గురించి సింగరేణి గుర్తింపు సంఘం, మరియు సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలతో ప్రభుత్వం చర్చించినప్పుడు గుర్తింపు సంఘం కానీ సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు కానీ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల గురించి ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. దీనిని బట్టి గుర్తింపు సంఘానికి, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలకు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పట్ల ఏపాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. సింగరేణి వార్షిక లాభాలలో కాంట్రాక్టు కార్మికులకు వాటా ప్రకటించకపోవడం సింగరేణి గుర్తింపు సంఘం, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేల వైఫల్యమే అన్నారు. ఇప్పటికైనా సింగరేణి వార్షిక లాభాలలో కాంట్రాక్టు కార్మికులకు కూడా వాటా ప్రకటించాలని సింగరేణి యాజమాన్యాన్ని ,ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

              ఈ కార్యక్రమం లో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ అధ్యక్ష ,కార్యదర్శులు వి. జానయ్య, ఎండీ. గౌస్, రామకృష్ణ, పాషా, రామయ్య, అశోక్, కృష్ణ, తాటి వెంకటేశ్వర్లు ,శంకర్, జగన్నాథం, స్వామి ,రామారావు, రాములు, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: