CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తుడుందెబ్బ వ్యవస్థాపక అధ్యక్షుడు దబ్బ గట్ల ప్రధమ వర్ధంతి సభ

Share it:




మన్యం టీవీ ఏటూరు నాగారం

తుడుందెబ్బ వ్యవస్థాపక అధ్యక్షులు దబ్బ గట్ల నర్సింగరావు ప్రధమ వర్ధంతి సభ ములుగు పట్టణంలోని సిపిఐ ఎంఎల్ రైతు కూలీ సంఘం కార్యాలయంలో ఆదివాసి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ అధ్యక్షతన ప్రధమ వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది.ఈ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లం అప్పయ్య,జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, తుడుందెబ్బ రాష్ట్ర కన్వీనర్ వట్టం ఉపేందర్ హాజరై మాట్లాడుతూ కొమురం భీం ఆశయసాధనకు అనుకూలంగా సమ్మక్క సారలమ్మ వారసులుగా దబ్బ గట్ల నర్సింగరావు పని చేశారని, ఆదివాసి జాతి కోసం ఆదివాసీ హక్కుల కోసం నిరంతరం కష్టపడి పనిచేసేవారని ఆదివాసుల ఐక్యత కోసం కృషి చేశారని ఆదివాసుల చట్టాలపై ఆదివాసి చట్టాల అమలు కోసం ఉద్యమాలు నిర్వహించేవారని వారు అన్నారు.ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంజుల బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ ఆదివాసీల ఆశ జ్యోతి డీఎన్ రావు అని బిక్షపతి అన్నారు.లోతట్టు ఏజెన్సీ ప్రాంతంలో పుట్టిన పులి బిడ్డ ఆదివాసి ముద్దు బిడ్డ నర్సింగరావు అని ములుగు ఎంపీపీగా పని చేసిన చరిత్ర నర్సింగరావు ఉన్నదని బిక్షపతి అన్నారు.సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ప్రసాద్ మాట్లాడుతూ నర్సింగరావు ను నేను ఎంపీపీగా చేసినన్ని ఆయన అన్నారు.ఒక ఆదివాసి ముద్దుబిడ్డ ఎంపీపీ కావాలని నేను పట్టుపట్టి ఎంపీపీ గా నర్సింగరావు చేసినాను తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి బుర్కా యాదగిరి తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రత్నం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నెమలి నరసయ్య,తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ కొమరం ప్రభాకర్,ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సంజీవ్, తదితరులు ఈ వర్ధంతి సభలో మాట్లాడారు కళాకారులు పాడిన పాటలకు వర్ధంతి సభ మార్మోగింది. ఈ వర్ధంతి సభలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మొగుళ్ల భద్రయ్య,బి ఎస్ పి జిల్లా అధ్యక్షులు శనిగరపు నరేష్,సిపిఎం నాయకులు గుండెబోయిన రవి గౌ డ్,మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి బాదావత్ రాజు,ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు వజ్ర రాజు,తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు కబ్బక శ్రవణ్ కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి చింత కృష్ణ, అరేం నారాయణ, ములుగు జిల్లా నాయకులు కొట్టం సంతోష్,మంకీడీ పూర్ణ, గుండె మీద వెంకటేశ్వర్లు, ఆదివాసి మహిళా నాయకురాలు సరోజన, కొమరం లక్ష్మీకాంత,పల్లె బోయిన స్వామి,ఆదివాసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు యాలం ఆదినారాయణ,తుడుందెబ్బ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మల్లెల రాము, కళాకారుల సంఘం జిల్లా నాయకులు గోల్కొండ బిక్షపతి, అమ్మ పాట తిరుపతి,రేలా విజయ్,రాగుల శంకర్,ఎండి రైమ్ ఉద్దీన్, తుడుందెబ్బ నాయకులు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: