CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఊపిరి పోయినా మరికొంత మంది జీవితాల్లో వెలుగులు నింపి ఆదర్శం గా నిలిచినా కొమరం కౌసల్య

Share it:

 


*ఊపిరి పోయిన ఐదుగురి జీవితాల్లో వెలుగులు.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామానికి చెందిన కొమరం కౌసల్య (60)

అప్పటివరకు బాగానే ఉండి అకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయాయి.దీంతో ఊహించని విషాదం చోటుచేసుకుంది.ఆరోగ్యం బాగానే వుంది కానీ.. మూడు రోజుల క్రితం కళ్ళు తిరిగి కింద పడి పోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హన్మకొండ కి తీసుకొని వెళ్లారు.అక్కడి నుండి హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కి తరలించారు. అన్నీ రకాల టెస్ట్ లు చేశాక తెలిసిందేమిటంటే.. తలలో గాయమై బ్రెయిన్ లో బ్లడ్ ప్లాట్ అయిందని డాక్టర్లు తెలిపారు. యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.ఈ విషాద వార్త తో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.తల్లి లేదన్న బాధ,ఆవేదనలో కూడా అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు.కౌసల్య కుటుంబ సభ్యులు వారి అమ్మ అవయవాలు అయిన కళ్ళు, ఊపిరి తీత్తులు,కిడ్నీలు, కాలేయం,గుండె దానం చేసి మరికొంత మంది జీవితాల్లో కొత్త జీవితాన్నినింపారు.వాటిని పలువురు బాధితులకు అమర్చారు వైద్యులు.జోహార్ కొమరం కౌసల్య అంటూ యశోద హాస్పిటల్ యాజమన్యం,సిబ్బంది సైల్యుట్ చేసి గౌరవ వందనాలతో సాగనంపారు. కొమరం కౌసల్య త్యాగం చాలా గొప్పది అని పలువురు ప్రశంసించారు. కౌసల్య మృతి చెందాక కూడా మరో ఐదుగురికి కొత్త జీవితాలను ఇవ్వడంతో.. కౌసల్య మరియు కొడుకు, కోడళ్ళు, కుటుంబ సభ్యులను హాస్పిటల్ యజమాన్యం ఊరట్టం గ్రామస్తులు...సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు ఆర్పించారు.

Share it:

Post A Comment: