CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు వినతి పత్రం అందజేసిన వెంకన్న కుటుంబసభ్యులు

Share it:

 


   మణుగూరు ఓసి-2 డంపర్, బొలెరో ప్రమాదంలో చనిపోయిన వేల్పుల.చిన వెంకన్న కుటుంబాన్ని ఆదుకోండి

మన్యం టీవీ, మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి లో ఇటీవల ఓసి-2 డంపర్,బొలెరో ప్రమాదంలో చనిపోయిన వేల్పుల.చిన్న వెంకన్న కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ వెంకన్న కుటుంబసభ్యులు భార్య సుజాత,కుమారుడు గణేష్, శనివారం ఉదయం కరకగూడెం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు ను ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వెంకన్న,భార్య సుజాత మాట్లాడుతూ, ప్రమాదంలో ఇద్దరు సింగరేణి కార్మికులతో పాటు తన భర్త వేల్పుల చిన వెంకన్న కూడా చనిపోయిన సంగతి అందరికి తెలిసిందేనని,సింగరేణి జిఎం జక్కం.రమేష్ ప్రత్యేక చొరవతో ఏరియా అధికారులు,గుర్తింపు సంఘం టిబిజీకేఎస్ మరియు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాల సహకారం తో ఏరియాలోని సింగరేణి కార్మికులు అందరూ తోబుట్టువులా ఆదుకున్నారు అని తెలిపారు.తన భర్త చనిపోయి శోక సముద్రంలో ఉన్న తమ కుటుంబానికి వారు అందించిన ఆర్థిక తోడ్పాటు, ఇంటికి వచ్చి పలకరించిన ఓదార్పుకు,తమ కుటుంబం వారికి ఎంతగానో రుణపడి ఉంటామని,అయితే సింగరేణి యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి నష్ట పరిహారం అందలేదని,అలాగే తన భర్త చనిపోవడంతో ఇంటి బాధ్యతలు చూసుకోవాలంటే తన ఇద్దరి కుమారులలో ఎవరికో ఒకరికి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.సింగరేణి యాజమాన్యానికి కూడా ఆ బాధ్యత ఉందని కూడా తాను భావిస్తున్నానని అన్నారు. ప్రమాద సంఘటన నేపథ్యంలో గుర్తింపు సంఘం తో పాటు ఏరియా కార్మిక సంఘాలు కూడా ఇదే విషయాన్ని డిమాండ్ రూపంలో వ్రాతపూర్వకంగా సింగరేణి యాజమాన్యం ముందుంచాయని,దయచేసి చట్టబద్ధంగా రావాల్సిన వర్క్ మెన్ కాంపెన్ సేషన్ తో పాటు, డంపర్ ఎక్కడంతో ధ్వంసమైన బొలెరో కు కూడా,నష్ట పరిహారం ఇప్పించాలని, ప్రత్యేక కేసుగా పరిగణించి ఎక్స్ గ్రేషియా తో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యులుగా రేగా కాంతారావు స్పందించాలని, ఉద్యోగం ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించేలా చూడాలని,అవసరమైతే ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లాలని విప్ రేగా కాంతారావు ను కోరినట్లు ఆమె తెలిపారు.ఈ విషయం పై విప్,రేగా కాంతారావు సానుకూలంగా స్పందించారు అని,న్యాయం జరిగేలా కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు అని తెలిపారు.

Share it:

Post A Comment: