CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రక్షణ సూత్రాలు పాటించు - ప్రమాదాలు నివారించు ఏరియా రక్షణాధికారి జె.వి. రమణ

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,


సింగరేణి గనిలో,పనిలో, మదిలో సేఫ్ ఆపరేషన్, ప్రొసీజర్ మార్గ దర్శకత్వంలో ప్రతి కార్మికుడు పనిచేయాలని, తద్వారా ప్రమాదాల నివారణ సాధ్యమని ఏరియా రక్షణాధికారి జే.వి.రమణ అన్నారు.సోమవారం నాడు పీకే ఓసి రక్షణ విభాగం ఆధ్వర్యంలో ఆపరేషన్,బేస్ వర్క్ షాప్,పవర్ సెక్షన్,బ్లాస్టింగ్ సెక్షన్,ఓ సి ఫోర్,దుర్గ ఓ బి కంపెనీ లో నిర్వహించిన *సేఫ్ ఆపరేషన్ ప్రొసీజర్ *ఎస్ ఓ పి* కార్మికులకు అవగాహన కార్యక్రమానికి మణుగూరు ప్రాంతీయ రక్షణాధికారి హోదాలో జే.వి.రమణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థులేనని,నాకు అన్నీ తెలుసు అనుకుంటే పొరపాటేనని,నిత్యం ఎస్ ఓ పి ని మననం చేసుకుని,వాటిని పనిలో ఆచరిస్తూ ప్రమాదాలు నివారించాలని,ప్రమాదాలు ఎప్పుడు,ఎలా జరుగుతున్నాయి,వాటి నివారణకు మనం చేపట్టవలసిన చర్యలు ఏమిటి అని,రక్షణ పై వారికున్న అవగాహనను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. తెలియని విషయాలను తెలియజెశారు.అనంతరం అన్ని విభాగాలలో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో పీకే ఓ సి సెక్షన్- 2 SOM ఎస్.ఓ. ఎం.దండమూడి.రాంబాబు,బేస్ వర్క్ షాప్ ఇన్ ఛార్జ్,దాసరి రాజశేఖర్,రిలే సి ఇంచార్జ్ ఎం. నరసింహారావు,సేఫ్టీ ఇంచార్జ్ అధికారి పి.భరత్ చంద్ర,పవర్ సెక్షన్ అధికారి భూక్యా. రామదాసు,బ్లా స్టింగ్ సెక్షన్ ఇంచార్జ్ షేర్ మధుసూదన్,ఓ సి 4- ఓబి ఇన్చార్జ్ రాజారాం మరియు అధికారులు కే సుదర్శన్ రెడ్డి,బాబ్జి,కృష్ణ మూర్తి,శంకర్,సతీష్ కుమార్, దుర్గ ఓ బి కంపెనీ మేనేజర్ పుచ్చకాయల రవిశంకర్, సూపర్వైజర్ లు కోలా వెంకటేశ్వర్లు,కోడి శ్రీనివాస్, మాదాసి శ్రీనివాస్,రంగారెడ్డి, గాలం రామకృష్ణ కరుణాకర్, వీర మహేష్ ,గుర్తింపు సంఘం నాయకులు, కాపా శివాజీ సీహెచ్,వి రెడ్డి,బర్ల గోపి, ఇందూరి శంకర్,బి. వెంకటేశ్వర్లు,కె.వి.రమణ, మోహినుద్దీన్,శ్రీనివాస్ సత్యనారాయణ,ఎం శ్రీనివాస్, రామ్మోహన్,ఎస్.ఓ.పి సమన్వయకర్త,ఎస్డి.నాసర్ పాషా,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: