CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొమరం దనలక్ష్మి

Share it:


మన్యం టీవీ మంగపేట.

 ఆదివారం మంగపేట మండల కేంద్రంలో శనివారం జరిగిన నిరుద్యోగ విద్యార్థి జంగ్ సైరన్ లో , భాగంగా, శాంతియుతంగా చేపట్టిన కార్యక్రమానికి ముందస్తు అరెస్టులు రేవంత్ రెడ్డి  హౌస్ అరెస్ట్  కార్యకర్తల పై నిర్బంధాలను ఉద్దేశించి నేడు మండల కేంద్రంలో, ధర్నా చేపట్టడం జరిగింది.

ఎన్ని ఆటంకాలు పెట్టిన ఎన్ని విధాలుగా మా కాంగ్రెస్ కార్య కర్తలను ఇబ్బందులకి గురి చేసిన ప్రజా సమస్యల పై విద్యార్ధి నిరుద్యోగులపై బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై నిరంతరం ప్రజా, క్షేత్రంలో ఉంటాం పోరాడుతామని దనలక్ష్మి అన్నారు.ఆదివారం మంగపేట మండల కేంద్రంలో ధర్నాకి యత్నిస్తుండగా మార్గమధ్యలోనే పోలీసుల అక్రమ అరెస్టులు చేయడం జరిగింది.ఈ నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలొనె బుద్ది చెప్తారని  ధనలక్ష్మి ఈ సందర్బంగా అన్నారు. అసలు తెలంగాణలో ప్రజలకు స్వేచ్ఛ ఉన్నదా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకలను అనగ తొక్కడమే తెరాస ప్రభుత్వ ముఖ్య లక్షణం లక్ష్యం అన్నారు, మీరు ఎన్ని విధాలుగా మా కార్యకర్తలను నాయకులను ఇబ్బందులకు గురి చేసినా కూడా, అలుపెరగని పోరాటం చేస్తామని కార్యకర్తలు యువత ఎవరు కూడా భయాందోళనకు గురి కాకూడదని రానున్నది కాంగ్రేస్ ప్రభుత్వమే అని దీమా వ్యక్తo చేసారు, కార్యక్రమంలో మంగపేట మండలం ఉపాధ్యక్షులు తుడి భగవాన్ రెడ్డి,బిసి సెల్ ప్రధానకార్యదర్శి పెద్ది నరసింహా రావు,ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి లావుడ్య శ్యామ్ లాల్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మురుకుట్ల నరేందర్,ఎస్సి సెల్ మండల అద్యక్షులు పల్లికొండ యాదగిరి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లయ్య, కిసాన్ సెల్ మండల అద్యక్షులు  చౌలమ్ వెంకటేశ్వర్లు,జిల్లా యూత్ కాంగ్రేస్ కార్యదర్శి కర్రి నాగేంద్రబాబు,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు  హిదాయుతుల్ల, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు మెహబూబ్ ఖాన్,మండల అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏంపెల్లి సమ్మయ్య,బేత నరసింహారావు,నర్రా కిషోర్,పూజారి సమ్మయ్య,మంగపేట గ్రామ ప్రశాంత్,యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉజ్వల్,ఊకే అజయ్,దూదిని సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: